Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్న సంజీవని మందులు పంపిణీ విస్తృతం...

అన్న సంజీవని మందుల వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రాష్ట్రంలోని 42 గిరిజన మండలాల్లో ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ’ (SERP) ద్వారా త్వరలోనే జెనరిక్ మందుల షాపులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. గిరిజన, పేద క

Advertiesment
అన్న సంజీవని మందులు పంపిణీ విస్తృతం...
, శుక్రవారం, 6 అక్టోబరు 2017 (20:43 IST)
అన్న సంజీవని మందుల వినియోగాన్ని విస్తృతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా రాష్ట్రంలోని 42 గిరిజన మండలాల్లో ‘గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ’ (SERP) ద్వారా త్వరలోనే జెనరిక్ మందుల షాపులను నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. గిరిజన, పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ‘అన్న సంజీవని జెనరిక్ మందుల షాపులు’ అందుబాటులోకి రానున్నాయని సెర్ప్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.కృష్ణమోహన్ వెల్లడించారు.
 
గిరిజన మండలాల్లో ఏర్పాటు చేయనున్న ‘అన్న సంజీవని జనరిక్ మందుల షాపు’లకు అవసరమైన స్థలాన్ని గుర్తించడం, వసతి, సౌకర్యాలు, టెక్నికల్‌గా కంప్యూటర్‌కి అవసరమైన సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయడం, లైసెన్స్ ఇప్పించడం, మందులు తెప్పించడం, ఎంత ధరకు అమ్మాలో నిర్ణయించడం, వీటికి కావలసిన శిక్షణనివ్వడంలాంటి బాధ్యతలన్నీ సెర్ప్ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. దాంతో పాటు ప్రజల్లో జెనరిక్ మందుల షాపుల పట్ల సరైన అవగాహన కల్పించటానికి ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించింది.
 
ఏడాది లోపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు వందలకు పైగా జెనరిక్ మెడికల్ షాపులను నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. అన్ని రకాల మందులూ అన్న సంజీవని కేంద్రాల్లో లభించేలా చర్యలు తీసుకోనుంది. గ్రామైక్య సంఘాల(డ్వాక్రా) సహకారంతో సంబంధిత మండలాల్లో బీ-ఫార్మసీ, డి-ఫార్మసీ పట్టా పొందిన నిరుద్యోగులను ఎంపిక చేసి వారి ధృవపత్రాల ద్వారా లైసెన్స్ పొంది జనరిక్ మందుల షాపుల ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా కొంత మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై-సెప్టెంబరులో బెంజ్ కార్ల అమ్మకాలు 41 శాతం పెరుగుదల