అక్టోబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లో లక్ష గృహ ప్రవేశాలు.. మంత్రి కాలవ శ్రీనివాసులు

అమరావతి : రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సహాయంతో పేదల కోసం నిర్మించిన లక్ష ఇళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (21:48 IST)
అమరావతి : రాష్ట్రంలో అక్టోబర్ 2న ప్రపంచ ఆవాస దినం, గాంధీ జయంతి సందర్భంగా ప్రభుత్వ సహాయంతో పేదల కోసం నిర్మించిన లక్ష ఇళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన చాంబర్ ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య, గ్రామీణ గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.16 వేల కోట్లతో 10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం లక్ష్యం అని చెప్పారు. పూర్తి పాదర్శకంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2న, సంక్రాంతి, జూన్ 8న మూడుసార్లు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఒకేసారి సామూహికంగా లక్ష ఇళ్లను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 5 స్థాయిల్లో జియో ట్యాగింగ్ చేసి నిర్మాణం పూర్తి అయినట్లు నిర్ధారణ చేసుకున్న తరువాతే గృహప్రవేశం చేయిస్తున్నట్లు మంత్రి వివరించారు.   
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా గ్రామగ్రామాన పండుగ వాతావరణ నెలకొనే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. లక్ష గృహ ప్రవేశాల సందర్భంగా ప్రతి ఇంటి వద్ద రెండు మొక్కల చొప్పున రెండు లక్షల మొక్కలు నాటే ఏర్పాటు చేయాలన్నారు. లబ్దిదారులు కోరిన మొక్కలు ఇవ్వమని చెప్పారు. లక్ష మంది లబ్దిదారుల వివరాలు వెబ్ సైట్‌లో నమోదు చేయాలని, జియోటాగ్ ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఇళ్ల ప్రారంభోత్సవం తరువాత ఆ ఫొటోలను ప్రపంచంలో అందరూ చూసేవిధంగా వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు.
 
11 వందలకు పైగా గ్రామ పంచాయతీలకు, 30 మునిసిపాల్టీల లోని వార్డులకు మొదటి దశలో ఇళ్లు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 9,835 గ్రామ పంచాయితీలలో, 884 వార్డులలో లక్షకు పైగా గృహాల నిర్మాణం పూర్తి అయినట్లు వివరించారు. లబ్దిదారుల పేర్లతో సహా మండల, జిల్లా స్థాయిల్లో పూర్తి వివరాలు ఈ నెల 27వ తేదీ సాయంత్రానికి ఏపీ హౌసింగ్ వెబ్ సైట్ apgovhousing.apcfss.in లో నమోదు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ప్రతి గ్రామంలో గృహ ప్రవేశాలు అయిన వెంటనే ఆయా ప్రాంతాల ఏఈలు ఫొటోలను వెబ్ సైట్‌లో అప్‌లోడ్ చేస్తారని చెప్పారు. ఇళ్ల వద్ద నాటే మొక్కలను అటవీ శాఖ వారు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
 
గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ గుడిసె లేని సమాజం ఈ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇంటింటికి మొక్కలు సరఫరా చేసే బాధ్యత కూడా మీరే తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇళ్ల ప్రారంభోత్సవాల సందర్భంగా పండుగ వాతావరణ నెలకొనేవిధంగా మామిడి ఆకుల తోరణాలు కట్టించడంతోపాటు అందుబాటులో ఉన్నచోట అరటి బాదులు ఏర్పాటు చేయాలన్నారు. ఏఈల ద్వారా సాధ్యమైనన్ని ఎక్కువ గృహ ప్రవేశ ఫొటోలు అప్‌లోడ్ చేయించాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఒక యజ్ఞంలాగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మిస్తున్నాం... చంద్రబాబు