Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

18 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.1200 ఉపకార వేతనాలు

అమరావతి: రాష్ట్రంలో చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్‌లు అన్నిటినీ నిర్దేశిత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్(ఎస్ఎల్ఏ) గడువు ప్రకారం సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ భారత జీవిత భీమా(ఎల్ఐసి

18 లక్షల మంది విద్యార్థులకు నెలకు రూ.1200 ఉపకార వేతనాలు
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:50 IST)
అమరావతి: రాష్ట్రంలో చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన క్లెయిమ్‌లు అన్నిటినీ నిర్దేశిత సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్(ఎస్ఎల్ఏ) గడువు ప్రకారం సకాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ భారత జీవిత భీమా(ఎల్ఐసి), ఓరియంటల్ ఇన్సూరెన్స్(ఓఐసి)సంస్థలకు సూచించారు. ఈ మేరకు సోమవారం వెలగపూడి సచివాలయంలోని ఆయన కార్యాలయంలో చంద్రన్న బీమా పధకంపై సంబంధిత శాఖల అధికారులు,ఆయా బీమా సంస్థలతో సమీక్షించారు. 
 
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ చంద్రన్న బీమా పధకానికి సంబంధించిన కేసులను ఆయా శాఖలు సకాలంలో నమోదు చేసి డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఎల్ఐసి, ఓఐసి బీమా సంస్థలకు పంపించి నిర్దేసిత ఎస్ఎల్ఏ ప్రకారం పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకుగాను సంబంధిత శాఖలు, బీమా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సిఎస్ స్పష్టం చేశారు. వచ్చిన క్లెయిమ్‌లను అర్హమైనవా కాదా అనేది మానిటరింగ్ కమిటీ సమావేశం పూర్తిగా పరిశీలించి వాటి అర్హతపై ఒకేసారి నిర్ణయం తీసుకోవాలని అంతేగాని అనవసరంగా ఒకసారి తిరస్కరించి మరోసారి వాటిని పరిశీలించడం వంటి చర్యలకు స్వస్తి పలకాలని ఆయన స్పష్టం చేశారు.
 
అక్టోబరు 2వతేదీన చంద్రన్న బీమా పధకంలో నమోదైన కుటుంబాల విద్యార్ధులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో శ్రీకారం చుట్టడం జరుగుతుందని ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 18లక్షల మంది విద్యార్ధులకు నెలకు 1200రూ.లు వంతున ఉపకార వేతనాలు పంపణీకై ఎల్ఐసికి క్లెయిమ్‌లు పంపగా ఇప్పటికే 2లక్షల 38వేల మంది విద్యార్ధులకు ఉపకార వేతనాలను మంజూరు చేసిందని తెలిపారు. అక్టోబరు నెలాఖరులోగా 18లక్షల మంది విద్యార్ధులకు ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)కింద ఈఉపకార వేతనాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.అక్టోబరు 31వతేదీన చంద్రన్న బీమాపై తదుపరి సమీక్ష నిర్వహించడం జరుగుతుందని అప్పటిలోగా పెండింగ్ లో ఉన్న క్లెయిమ్ లు అన్నీ పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ దినేష్ కుమార్ సూచించారు.
 
కార్మిక,ఉపాధి కల్పన మరియు శిక్షణశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రన్న బీమా పధకం అమలుకు జాతీయ స్థాయిలో ఎల్ఎసి నోడలు ఏజెన్సీగా ఉందని అన్నారు.ఈపధకం అమలుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మిక,ఉపాధి కల్పన శాఖ కమీషనర్ డి.వరప్రసాద్ సమావేశ అజెండాను వివరిస్తూ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి చంద్రన్న బీమాకు సంబంధించి ఇప్పటి వరకూ 8వేల 675 క్లెయిమ్‌లు రాగా మరో 772 ప్రగతిలో ఉండగా 7వేల 48 మంజూరు కోసం అప్‌లోడ్ చేయగా మరో 421 ప్రగతిలో ఉన్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉ.కొరియా అంటే డ్రాగన్‌కు భయం: భారత్‌లో రహదారులు మురికి కూపాలు: చైనా ఎద్దేవా