Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు : స్పీకర్ శివప్రసాదరావు

అమరావతి :ఈ నెల 30వ తేదీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాధిపతి డా.కోడెల శివప్రసాదరావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈమేరకు ఆయన కార్యాలయం ను

Advertiesment
Navratri 2017
, శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (14:04 IST)
అమరావతి :ఈ నెల 30వ తేదీ విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాధిపతి డా.కోడెల శివప్రసాదరావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియ జేశారు. 
 
ఈమేరకు ఆయన కార్యాలయం నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగ సందర్భంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భక్తులు చేసిన ప్రార్థనలు లోక కళ్యాణానికి, సుఖశాంతులకు ఆలవాలం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సకల సిరిసంపదలు కలగాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పధంలో ముందుండాలని దుర్గామాతను వేడుకుంటున్నట్టు స్వీకర్ పేర్కొన్నారు.
 
అదేవిధంగా దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా స్వీకర్ పేర్కొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా కనకదుర్గ మాత ఆశీస్సులు తెలుగువారందరికీ లభించాలని అన్ని వర్గాల ప్రజలకు ఈ సంవత్సరంలో విజయాలు చేకూరాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నట్టు స్వీకర్ శివప్రసాద రావు ఆ ప్రకటనలో తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 29-09-17