శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 29-09-17

మేషం : ఆస్థి తగాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. రావలసిన ధనం అతి కష్టంమీద వసూలు అవుతుంది. విద్యార్థినులకు పరిచయాలు, వ

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (04:00 IST)
మేషం : ఆస్థి తగాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. రావలసిన ధనం అతి కష్టంమీద వసూలు అవుతుంది. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
వృషభం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది. నిజాయితీగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఖర్చులు అదుపు చేయాలనే మీ యత్నం ఫలించదు. పాత మిత్రుల ద్వారా ఒక సమస్య పరిష్కారం అవుతుంది.
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా నెమ్మదిగా సమసిపోతాయి. పరిశోధకులకు, గణిత, సైన్సు ఉపాధ్యాయులకు గణనీయమైన పురోభివృద్ధి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. అనుభవజ్ఞుని సలహా తీసుకోవటం వల్ల అభివృద్ధి పొందుతారు. చేతి వృత్తులు, చిన్నతరహా, కుటీర పరిశ్రమల వారికి ఆశాజనకం.
 
కర్కాటకం : మిత్రుల సహకారంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభం అవుతాయి. స్థిరాస్తి అమ్మకం వాయిదా పడటం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అకాల భోజనం, శ్రమాధిక్యతవల్ల ఆరోగ్యం మందగిస్తుంది. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి.
 
సింహం : ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. మీ అభిప్రాయాలు, ఆలోచనలను గోప్యంగా ఉంచుకోవటం మంచిది. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు.
 
కన్య : విద్యార్థుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ కోపతాపాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బందితో చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక లక్ష్యం నెరవేరదు. ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. చిరు వ్యాపారులకు ఆశాజనకం.
 
తుల : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లోని వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్య ధోరణి వల్ల మాటపడక తప్పదు. ప్రియతముల రాక మీకెంతో సంతృప్తినిస్తుంది. ఉపాధ్యాయులకు అనుకూలమైన కాలం. పీచు, ఫోం, లెదర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవటం మంచిది.
 
వృశ్చికం : రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తలెత్తుతాయి. స్త్రీలు వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. రచయితలు, పత్రికా, ప్రైవేటు సంస్థల్లోని వారికి సదవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
ధనస్సు : స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
 
మకరం : దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో మితంగా వ్యవహరించండి. కీలకమైన ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు.
 
కుంభం : భాగస్వామిక చర్చలు ఆశించినంత చురుకుగా సాగవు. గృహ నిర్మాణాల్లో కాంట్రాక్టర్లకు ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగాల్సి ఉంటుంది. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
 
మీనం : విదేశీయ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యా సంస్థల్లోని వారికి సమస్యలు తలెత్తుతాయి. ప్రత్తి, పొగాకు, మిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలసివచ్చే కాలం. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాళ్లుగా నిలుస్తాయి. మీ ఆవేశం, అవివేకంవల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది, జాగ్రత్త వహించండి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మంగళవారం తలస్నానం చేస్తే...