Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శుభోదయం.. ఈ రోజు రాశిఫలితాలు 25-09-2017

మేషం: ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. వృత్తి వ్యాపార రంగాల్లో వారికి అంచనాలు ఊహలు తారుమారయ్యే ఆస్కారం ఉంది

శుభోదయం.. ఈ రోజు రాశిఫలితాలు 25-09-2017
, సోమవారం, 25 సెప్టెంబరు 2017 (05:48 IST)
మేషం: ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. దూర ప్రయాణాలు మీకు అనుకూలించగలవు. వృత్తి వ్యాపార రంగాల్లో వారికి అంచనాలు ఊహలు తారుమారయ్యే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
 
వృషభం: ప్రైవేట్ సంస్థల్లో వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. సహోద్యోగుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. రాజకీయ నాయకులకు ప్రయాణాలు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. 
 
మిథునం: కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఇబ్బందులు తప్పవు. పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల ఏకాగ్రత అవసరం.
 
కర్కాటకం: ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధుమిత్రులతో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి.
 
సింహం: ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. బంధువులకు ధనసహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది.
 
కన్య: పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కొంటారు. వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత బాగా అవసరం. రుణ ప్రయత్నం వాయిదా పడగలవు. స్త్రీలకు, టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం.
 
తుల: వాతావరణంలో మార్పు వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసివస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి.
 
వృశ్చికం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది. బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మంచి చేసినా విమర్శలు తప్పవు. కళాకారులకు గుర్తింపు, లభిస్తుంది.
 
ధనస్సు: ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఏమాత్రం ముందుకు సాగవు. స్త్రీలు కండరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి లేదా వాహనాలు కొనుగోలు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించండి.
 
మకరం: విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ధనం బాగా వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి. దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
కుంభం: వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు వుండవు. ఆకస్మిక ధనలాభం, కార్యసిద్ధి, దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆందోళన కలిగించిన సమస్య సమసిపోతుంది. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. రుణ వాయిదాలు, పన్నులు, ఫీజులు సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీణాపాణీయుడై సరస్వతీమూర్తిగా విహరించనున్న శ్రీవారు