Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 24-09-2017

మేషం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలసిరాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. త

Advertiesment
శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 24-09-2017
, ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (05:47 IST)
మేషం : సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలసిరాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు. పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైనా సకాలంలో పూర్తి చేస్తారు.
 
వృషభం: ఉద్యోగ, ఉన్నత విద్యా యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఒకింత ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు.
 
మిథునం: వృత్తి వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి. కుటుంబీకుల నుంచి, మిత్రుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాల విస్తరణకు కొంత జాప్యం తప్పదు. అతిగా సంభాషించడం వల్ల ఏర్పడే అనర్థాన్ని ఈ మాసం గుర్తిస్తారు. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. 
 
కర్కాటకం: వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విదేశీయాన యత్నాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు లభిస్తుంది.
 
సింహం : ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. రచయితలు, క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. మొహమ్మాటాలకు దూరంగా ఉండాలి.
 
కన్య: ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. మీ సోదరుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. అపరిచితులతో మితంగా సంభాషించడం క్షేమదాయకం.
 
తుల: వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు కానవస్తాయి. రాజకీయనాయకులు, సభ, సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.
 
వృశ్చికం: సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తలెతుత్తాయి. స్త్రీలు శారీరక మానసిక వేదనకు గురవుతారు. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. సంఘంలో మంచిపేరు, ఖ్యాతి గడిస్తారు. రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
ధనస్సు: విద్యార్థులు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు.
 
మకరం: కిరణా, ఫ్యాన్సీ, పండ్ల, పూల, వ్యాపారులకు శుభదాయకం. మీ సంతానం మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది.
 
కుంభం : ధన వ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. బంధువుల రాకతో గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి.
 
మీనం: విద్యుత్, రవాణా రంగాల్లోని వారికి చికాకులు అధికం. ఉద్యోగం మాని వ్యాపారాలు చేయడం మంచిది కాదని గమనించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సెప్టెంబరు 24 నుంచి సెప్టెంబరు 30,2017 వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)