Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెప్టెంబరు 24 నుంచి సెప్టెంబరు 30,2017 వరకూ మీ వార రాశి ఫలితాలు(వీడియో)

కర్కాటకంలో రాహువు, సింహంలో బుధ, శుక్ర, కుజులు, కన్యలో రవి, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 26న బుధుడు కన్య యందు ప్రవేశం. 28న దుర్గాష్టమి, సరస్వతీ పూజ, 29న మహార్నవమి, 30న విజయదశమి.

Advertiesment
24 September 2017 to 30 September 2017 weekly Predictions
, శనివారం, 23 సెప్టెంబరు 2017 (21:30 IST)
కర్కాటకంలో రాహువు, సింహంలో బుధ, శుక్ర, కుజులు, కన్యలో రవి, తులలో బృహస్పతి, వృశ్చికంలో శని, మకరంలో కేతువు. తుల, వృశ్చిక, ధనస్సు, మకరంలలో చంద్రుడు. 26న బుధుడు కన్య యందు ప్రవేశం. 28న దుర్గాష్టమి, సరస్వతీ పూజ, 29న మహార్నవమి, 30న విజయదశమి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం.
ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. అవసరాలకు ధనం అందుతుంది. ఆర్థిక, కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. సంతానం కదలికలను గమనిస్తూవుండాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆది, గురువారాల్లో పనులు మొండిగా పూర్తి చేస్తారు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆశావహదృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. అమ్మవారికి గులాబీలు, చామంతులతో అర్చన శుభదాయకం.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు 
సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మంగళ, శనివారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పదవులు, సభ్యత్వాలు నుంచి తప్పుకుంటారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పథకాలు, ప్రణాళికలు మునుముందు సత్ఫలిస్తాయి. ఖర్చులు సామాన్యం. అవసరాలు నెరవేరుతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో పెద్దల జోక్యం అనివార్యం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఆశించిన టెండర్లు, ఏజెన్సీలు దక్కకపోవచ్చు. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు వున్నాయి. కార్యసాధనకు అమ్మవానికి కలువలు, మందారాలతో పూజించండి.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మంగళ, శనివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సాయం, సలహాలు ఆశించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు, అనుభవం గడిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. ఆధ్యాత్మిక, సేవా సంస్థలకు సాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ధనయోగం, పదోన్నతి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. చామంతులు, తెల్లని పూలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యలు తొలగిపోతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సర్వత్రా అనుకూలతలుంటాయి. పట్టుదలతో శ్రమించిన గాని పనులు పూర్తి కావు. గురు, శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. విమర్శలు, అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు. ఉద్యోగ ప్రకటనలను విశ్వసించవద్దు. బోగస్ కంపెనీల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలు లాభిస్తాయి. పెట్టుబడులకు అనుకూలం. టెండర్లు చేజిక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రాప్తి. వృత్తుల వారికి ప్రజాసంబంధాలు బలపడతాయి. దైవదర్శనాలు, ప్రయాణంలో చికాకులు తప్పవు.
 
సింహం : మఖ, పుబ్బ,  ఉత్తర 1వ పాదం 
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. చాకచక్యంగా వ్యవహరించాలి. ఎవరినీ విశ్వసించవద్దు. ఖర్చులు సంతృప్తికరం. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శనివారం నాడు అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు ధనప్రలోభం తగదు వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. దూర ప్రదేశంలోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. అమ్మవారికి దేవగన్నేరు, ఎర్ర మందారాలతో అర్చిస్తే శుభం. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు, చెల్లింపులు వాయిదా పడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతులకు సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. సన్నిహితుల సలహా పాటించండి. సంప్రదింపులు వాయిదా పడతాయి. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలోనే ఫలిస్తుంది. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. సాంకేతిక, వైద్య రంగాల వారికి ఆశాజనకం. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారికి పారిజాతం, సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చన శుభం, జయం.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణాలు చురుకుగా సాగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎదుటివారి నైజం గ్రహిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మెలగాలి. ఖర్చులు విపరీతం. ధనానికి లోటుండదు. అవసరాలు నెరవేరుతాయి. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. దైవదర్శనాలు సంతృప్తికరం. కార్యసాధనకు అమ్మవారిని కలువలు, చామంతులతో పూజించకండి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పెట్టుబడులు కలిసివస్తాయి. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో జాగ్రత్త వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. ఆది, సోమవారాల్లో బంధువులు ఇరకాటంలో పెట్టేందుకు యత్నిస్తారు. మీ అభిప్రాయాలను కచ్చితంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి. పరిచయం లేని వారితో జాగ్రత్త. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. దైవదర్శనాలు ఉల్లాసం కలిగిస్తాయి. జూదాల జోలికి పోవద్దు.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం 
బంధువుల వ్యాఖ్యలు కష్టమనిపిస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. సమర్థతపై నమ్మకం పెంచుకోండి. మంగళ, బుధవారాల్లో ఎవరి సాయం ఆశించవద్దు. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. నోటీసులు, పత్రాలు అందుతాయి. విదేశీ విద్యాయత్నం ఫలించకపోవచ్చు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. గుట్టుగా యత్నాలు సాగించండి. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. దేవగన్నేరు, ఎర్రగులాబీలతో అమ్మవారికి అర్చన కలిసి రాగలదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు 
మొదలెట్టిన యత్నాలు విరమించుకోవద్దు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సన్నిహితుల సాయంతో  ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆదాయ వ్యయాలు ఫర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు భారమనిపించవు. పనులు మందకొడిగా సాగుతాయి. గురు, శుక్రవారాల్లో మీ మాటతీరు అదుపులో వుంచుకోవాలి. ఎవరినీ నిందించవద్దు. విమర్శించిన వారే మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. సంతానం రాక సంతోషాన్నిస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరం. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. అధికారుల వైఖరిని గమనించి మెలగండి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు ఫలిస్తాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి అనుకూలం. అమ్మవారికి కలువలు, గరుడవర్ధిని పూలతో అర్చన శుభదాయకం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు 
వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగదు. గృహ మార్పునకు యత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వేడుకలు, వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దైవదర్శనాలు అతికష్టం మీద అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు.
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
కొత్త బాధ్యతలు చేపడతారు. గృహంలో సందడి నెలకొంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆది, సోమవారాల్లో బ్యాంకు వివరాలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ధనయోగం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. విద్యార్థుల లక్ష్యం నెరవేరుతుంది. పారిజాతం, కనకాంబరాలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.
 
వీడియో చూడండి... 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవరాత్రి స్పెషల్.. పనీర్ పాయసం ఎలా చేయాలి..?