Webdunia - Bharat's app for daily news and videos

Install App

ర‌మ్య కేసు విచార‌ణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చేరుకున్న జాతీయ ఎస్సీ కమిషన్

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (10:28 IST)
గుంటూరులో బిటెక్ విద్యార్థిని ర‌మ్య హ‌త్య కేసులో నిజ‌నిర్ధార‌ణ‌కు జాతీయ ఎస్సి కమిషన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేరింది. గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్న జాతీయ ఎస్సి కమిషన్ బృందానికి భాజపా ముఖ్య నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

ఎస్సీ కమిషన్ బృందంలో వైస్ చైర్మన్ అర్జున్ హల్ధార్, మెంబెర్స్ డాక్టర్ అంజుబాల, సుభాష్ రంగ‌నాథ్, భాజపా నుండి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిషోర్ బాబు, సరణాల మాలతి రాణి, ఎస్సి మోర్చా అధ్యక్షులు గుడిసె దేవానంద్, మహిళా మోర్చా అధ్యక్షురాలు, నిర్మలా కిషోర్ పలువురు దళిత నాయకులు ఉన్నారు.

వీరంతా గుంటూరులో ర‌మ్య హ‌త్య‌పై నిశిత ప‌రిశీల‌న చేస్తారు. బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, వారి నుంచి సంఘ‌ట‌న వివ‌రాల‌ను అడిగి తెలుసుకుంటారు. ర‌మ్య హ‌త్య‌పై ఏపీ ప్ర‌భుత్వం వెనువెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో ఆ కుటుంబానికి ఇప్ప‌టికే కొంత ఊర‌ట ల‌భించింది. నిందితుడు స‌త్య కృష్ణ‌ను వెంట‌నే అరెస్ట్ చేసి, రిమాండుకు త‌ర‌లించారు. అయితే, ఈ కేసులో ఏదైనా లొసుగులు ఉన్నాయా? అనే కోణంలో జాతీయ ఎస్సీ క‌మిష‌న్ విచార‌ణ జ‌ర‌ప‌నుంది. అలాగే, క‌మిష‌న్ స‌భ్యులు, ఏపీ డీజీపిని, ఏపీ హోం మంత్రిని కూడా క‌లిసే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments