Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతక విజేత వెంక‌ట్రాద్రి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (11:05 IST)
విజ‌య‌వాడ‌లోఏని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రధమ సంవత్సరం విద్యార్థి కె.వెంకటాద్రి ఆర్చ‌రీలో విశేష‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన 40వ యన్టీపీసీ సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేకా రమేష్ తెలిపారు.

స్కూల్ స్థాయి నుండే ఆర్చరీ అభ్యాసం చేస్తున్న వెంకటాద్రి పలు పోటీల్లో పాల్గొని రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచినట్లు చెప్పారు. భవిష్యత్తులోనూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ద‌మ‌వుతున్నట్లు కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకం సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచిన వెంకటాద్రిని సిద్ధార్థ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వర్లు, పాలడుగు లక్ష్మణరావు, కళాశాల కన్వీనర్ సూరెడ్డి వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్ధులు అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments