ఇటీవల అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడంతో.. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలతో సత్ సంబంధాలను కోరుకుంటున్నట్లు కూడా తాలిబన్లు వెల్లడించారు. ఈ మధ్యే జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాల సమయంలోనూ.. తమ తరపు ప్రతినిధి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని తాలిబన్లు కోరారు.
వివిధ దేశాలతో సఖ్యత నెలకొల్పన్న ఉద్దేశంతో తాలిబన్లను చర్చలకు రష్యా ఆహ్వానిస్తోంది. అక్టోబర్ 20వ తేదీన అంతర్జాతీయ చర్చలు నిర్వహించేందుకు తాలిబన్లను రష్యా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
తాలిబన్ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తరపు రాయబారి వెల్లడించారు. ఇప్పటికే ఆహ్వానాన్ని పంపినట్లు జమిర్ కుబులోవ్ తెలిపారు. అయితే మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది. ఎవరు హాజరవుతారన్న అంశాలపై క్లారిటీ రాలేదు. నిజానికి తాలిబన్లను నిషేధిత ఉగ్రవాద సంస్థగా చూస్తారు. రష్యాలోనూ ఆ సంస్థపై బ్యాన్ ఉందన్న సంగతి తెలిసిందే.