Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరమంతా పాయిజన్ ఉన్న లీడర్ విజన్ ఇలానే ఉంటుంది : నారా లోకేశ్

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (15:54 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శలు సంధించారు. 'విజన్ ఉన్న లీడర్‌కు, ఒంటి నిండా పాయిజన్ ఉన్న లీడర్‌కు తేడా ఇదేనంటూ' పట్టిసీమ ప్రాజెక్టు నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. 
 
విజన్ ఉన్న లీడర్ రాబోయే సంక్షోభాన్ని ముందే పసిగట్టి నివారణ చర్యలు తీసుకుంటారని, పట్టిసీమ ప్రాజెక్టు అలాంటి ఆలోచన నుంచి పుట్టిందేనని వెల్లడించారు. ఇక ఒంటినిండా పాయిజన్ ఉన్న లీడర్ ముందు చూపు లేక, వరదలు వచ్చినా వినియోగించుకోలేక, ప్రజల్ని ముంచి నీటిని సముద్రం పాలుచేస్తారని విమర్శించారు. 
 
ఎగువ రాష్ట్రాల నుంచి ఎంత వరద వచ్చినా సద్వినియోగం చేసుకోలేక, చివరికి పనికిరాని పట్టిసీమ అన్నవాళ్లే మోటార్లు ఆన్ చేసి నీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాగా, గత కొన్ని రోజులుగా నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా చాలా యాక్టివ్‌గా ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments