Webdunia - Bharat's app for daily news and videos

Install App

రావాలి కరెంట్... కావాలి కరెంట్: సీఎం జగన్ పైన లోకేష్ సెటైర్లు

Webdunia
బుధవారం, 24 జులై 2019 (16:52 IST)
తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తరువాత సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తున్నారు లోకేశ్. వైసీపీ ప్రభుత్వంపై తనదైన స్టయిల్లో సెటైర్లు వేస్తున్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో కరెంట్ కోతలు పెరిగాయంటూ గత  కొద్దిరోజులుగా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. 
 
కరెంట్ కోతలు వుండడం వాస్తవం కూడా.. అయితే దీనిపై నారా లోకేశ్, ప్రభుత్వంపై ట్విట్టర్లో సెటైర్లు వేశారు. ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ ఫ్యాన్ గుర్తును బ్రతిమాలుతున్నారని ఎద్దేవా చేశారు. 
 
బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్, కావాలి కరెంట్ అని మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ బతిమిలాడుకుంటున్నారు. 
 
మీరు కాస్త చీకట్లోంచి బయటకు వచ్చి
 ప్రజలకు కరెంట్ ఇవ్వాలని నారా లోకేశ్ సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరి ‘రావాలి కరెంట్.. కావాలి కరెంట్’ అంటూ వేసిన లోకేష్ సెటైర్‌కు వైసిపి ఏ రకంగా కౌంటర్ ఇస్తుంది చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments