Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ సాక్షిగా నిజాలు చెబుతున్న సీఎం జగన్ : లోకేశ్ సెటైర్

అసెంబ్లీ సాక్షిగా నిజాలు చెబుతున్న సీఎం జగన్ : లోకేశ్ సెటైర్
, బుధవారం, 17 జులై 2019 (15:35 IST)
పాదయాత్రలో పచ్చి అబద్ధాలు చెప్పిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఇపుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు అంగీకరిస్తున్నారనీ, అందుకు ధన్యవాదాలు అంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోమారు ట్వీట్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన తాజాగా ఓ ట్వీట్ చేశారు. పాదయాత్రలో ఒక్క నిజం కూడా మాట్లాడని జగన్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజాలు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. 'జాబు రావాలి అంటే బాబు పోవాలి', 'బాబు హయాంలో ఒక్క జాబు కూడా రాలేదు' ఇలాంటి ఎన్నో అబద్దాలను పాదయాత్రలో జగన్ చెప్పారు. 
 
ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు హయాంలో 39,450 పరిశ్రమలు ఏర్పాటు చేసి 5,13,351 మందికి ఉద్యోగాలు కల్పించారు అని చెప్పారు. ఐటీలో వెయ్యి కోట్ల పెట్టుబడులతో 175 కంపెనీల ద్వారా 30,428 మందికి ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. 
 
ఇలానే ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇతర రంగాల్లో మేమిచ్చిన ఉద్యోగాలు, ఏర్పాటవుతున్న కంపెనీలు, రాబోయే ఉద్యోగాల వివరాలు కూడా బయటపెట్టి మీ పత్రిక అసత్యాల సాక్షి అని ప్రజలందరికీ తెలియజేయాలని జగన్‌ని కోరుతున్నాను. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న కంపెనీల వివరాలు మీరెలాగూ బయట పెట్టరు. ఇవిగోండి! మీరు చెప్తున్న 5.60 లక్షల ఉద్యోగాలతో పాటు చంద్రబాబు హయాంలో పనులు ప్రారంభించి, రాబోయే రోజుల్లో యువతకు అందించబోతున్న మరో 8 లక్షల పైచిలుకు ఉద్యోగాల వివరాలు. ఇవి కూడా మీ ఘనతగా చెప్పుకుంటారేమో! అంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేశినేని నాని పార్టీ మారడం ఖాయం? కానీ మెలిక పెట్టిన సీఎం జగన్