Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు.. ఏం చేద్దాం: నారా లోకేష్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తనపై పవన్, జగన్ చేస్తున్న ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ.. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం

Webdunia
బుధవారం, 18 జులై 2018 (18:22 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. తనపై పవన్, జగన్ చేస్తున్న ఆరోపణలపై నారా లోకేష్ స్పందిస్తూ.. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం కనిపించకుండా పోతారని చురకలంటించారు. ఆధారాలతో ముందుకు వస్తే తన తప్పు కూడా తెలుసుకుంటానని నారా లోకేశ్ అన్నారు. 
 
అలాగే పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండలో బుధవారం నిర్వహించిన ''గ్రామదర్శిని''లో నారా లోకేష్ మాట్లాడుతూ.. 'మనం వేసిన రోడ్లపై దొంగబ్బాయి నడుస్తున్నాడు' తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనపై ఎన్నో కేసులున్నా చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీని మాత్రం జగన్ ఎందుకు ప్రశ్నించరని అడిగారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీలు ఎక్కడా కనబడడం లేదని నారా లోకేష్ ఏకిపారేశారు. 
 
ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధి గురించి నారా లోకేష్ మాట్లాడారు. ఏపీలో డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని, రాష్ట్రంలో 50 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని గుర్తు చేశారు. నిరుద్యోగులకు వచ్చేనెల నుంచి వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని లోకేష్ వెల్లడించారు. ఎన్నికల లోపు ప్రతి ఇంటికీ మంచినీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. 
 
అమ‌రావ‌తిలో అక్టోబ‌ర్ నాటికి 20 లక్షల స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ స్పేస్ సిద్ధమని మంత్రి లోకేష్ తెలిపారు. మంగ‌ళ‌గిరి ఐటిపార్క్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆగ‌స్టు నాటికి రాష్ట్రానికి పెద్ద కంపెనీలు రాబోతున్నాయని, పాలసీ ప్రకారం ప్రతిష్టాత్మక కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments