Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీలో నారా బ్రాహ్మణి పాత్ర ఏమిటి?.. ఇదేం క్వశ్చన్ సామి?

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (20:25 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రిమాండ్‌లో వున్నారు. ఆయన కుమారుడు నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఏపీకి శుక్రవారం వచ్చారు. ఈ మధ్యలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ అరెస్టయ్యే అవకాశం వుంటే.. పార్టీకి అంతా తానై నారా బ్రాహ్మణి నడుపుతారని అందరూ భావించారు. 
 
అయితే ఈ ప్రశ్న నారా లోకేష్‌కు ఎదురైంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరి, సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి మీడియాతో మాట్లాడారు. టీడీపీలో నారా బ్రాహ్మణి పాత్ర ఏమిటి? అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ సరైన కౌంటర్ ఇచ్చారు. ఇదేం క్వశ్చన్ సామి అన్నారు. 
 
మా తల్లి మాజీ ముఖ్యమంత్రి కూతురు, మరో మాజీ ముఖ్యమంత్రి భార్య, కానీ ఆమె ఎప్పుడైనా బయటకు వచ్చారా? ప్రమాణ స్వీకారానికి తప్ప ఏ కార్యక్రమానికైనా నా తల్లి హాజరయ్యారా? అని ఎదురు ప్రశ్న వేశారు. 
 
కానీ ఈ రోజు తమ కుటుంబం మొత్తాన్ని రోడ్డుపైకి తీసుకు వచ్చింది ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ పిచ్చి జగన్ అని మండిపడ్డారు. తద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణిలు చంద్రబాబు కోసం రోడ్డుపైకి వచ్చారు తప్ప పార్టీలో ఏదో పాత్ర కోసం కాదని అర్థం వచ్చేలా నారా లోకేష్ కామెంట్స్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments