Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపీ తీరు ఎలా వుందంటే..? నారా లోకేష్ ఎద్దేవా

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసనపై వైసీపీ ప్రతి దీక్షలు చేస్తుంటే చూసేందుకు హాస్యాస్పదంగా వుందని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఏపీ

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (15:06 IST)
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ చేపడుతున్న నిరసనపై వైసీపీ ప్రతి దీక్షలు చేస్తుంటే చూసేందుకు హాస్యాస్పదంగా వుందని ఐటీ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ ఏపీ ప్రజల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. 
 
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 30వ తేదీన తిరుపతిలో సీఎం చంద్రబాబు దీక్ష చేపడుతున్న నేపథ్యంలో.. అదే రోజు వైసీపీ విశాఖలో నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు వైసీపీ ప్రకటించడంతో లోకేష్ ఇలా స్పందించారు. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని వైసీపీ పాటిస్తోందని నారా లోకేష్ అన్నారు.
 
ఇదిలా ఉంటే గవర్నర్ నరసింహన్‌తో జరిగిన సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విభజన హామీలు అమలు చేయకపోవడం, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు సృష్టిస్తోందని, హోదాతోపాటు ఏపీకి ఇవ్వాల్సిన 18 అంశాలను కేంద్రం అమలు చేయలేదని సీఎం గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments