Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరేంద్ర మోదీపై నారా లోకేష్ ట్వీట్.. బాధాకరమంటూ పీఎంవో రీ ట్వీట్

ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చురుకుగా వున్నారు. ప్రజా సమస్యలతో పాటు రాజకీయాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. పీఎంవోకు మాత్రమే కాకుండా.. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విపక్ష ఎంపీలపై

Advertiesment
నరేంద్ర మోదీపై నారా లోకేష్ ట్వీట్.. బాధాకరమంటూ పీఎంవో రీ ట్వీట్
, గురువారం, 19 ఏప్రియల్ 2018 (14:52 IST)
ఏపీ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో చురుకుగా వున్నారు. ప్రజా సమస్యలతో పాటు రాజకీయాలపై కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. పీఎంవోకు మాత్రమే కాకుండా.. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విపక్ష ఎంపీలపై చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. కరెన్సీ కష్టాలపై జైట్లీ చేసిన ట్వీట్లకు కూడా మంత్రి లోకేష్ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.
 
దేశంలో కావలసిన దానికంటే ఎక్కువగానే నగదు ఉందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ట్వీట్‌పై నారా లోకేశ్ మండిపడుతూ కౌంటరిచ్చిన నేపథ్యంలో గురువారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. ఏపీకి చేసిన మోసంపై మోదీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. అయితే నారా లోకేష్ విమర్శలకు పీఎంవో స్పందించింది. సరైన పరిశోధన, ఆధారాలు లేకుండా తనపై అసత్య ఆరోపణలు చేయడం బాధాకరమంటూ నరేంద్ర మోదీ తరపున ట్వీట్ చేసింది. 
 
దీనిపై స్పందించిన నారా లోకేశ్ ట్వీట్ చేస్తూ... ఏపీకి ప్రత్యేక హోదా సహా చట్టంలో పొందుపర్చిన విధంగా ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని తాము ప్రశ్నించామని, బీజేపీ నేతలే ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై బురద చల్లుతున్నారన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి.. పవన్‌పై మాటలొద్దు.. బాబు దీక్షకు మద్దతు: తమ్మారెడ్డి