Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీరెడ్డి అనవసరంగా పవన్‌ను ఇష్యూలోకి లాగిందా? చెర్రీ ఏమన్నాడు? (video)

శ్రీరెడ్డికి సోషల్ నెట్‌వర్క్‌లో మాంచి ఫాలోయింగ్ వుంది. ఫేస్‌బుక్‌లో దాదాపు 60లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దాదాపు అంతేమంది ఆమె ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో 22వేల మందికి పైగా

Advertiesment
శ్రీరెడ్డి అనవసరంగా పవన్‌ను ఇష్యూలోకి లాగిందా? చెర్రీ ఏమన్నాడు? (video)
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (17:30 IST)
శ్రీరెడ్డికి సోషల్ నెట్‌వర్క్‌లో మాంచి ఫాలోయింగ్ వుంది. ఫేస్‌బుక్‌లో దాదాపు 60లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు. దాదాపు అంతేమంది ఆమె ఫేస్‌బుక్ పేజ్‌ను లైక్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో 22వేల మందికి పైగా ఆమెకు ఫాలోవర్లు వున్నారు. అయితే శ్రీరెడ్డి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
 
నిజానికి పవన్‌ను అనవసరంగా ఈ ఇష్యూలోకి లాగకుండా.. కాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసుకుంటూ పోయివుంటే.. ఆమెకు మంచి సింపతీ వుండేది కానీ ప్రస్తుతం మొత్తం పాడైపోయింది. శ్రీరెడ్డితో పాటు తెలుగు సినీ పరిశ్రమపై కొందరు చేస్తోన్న ఆరోపణలపై సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై మెగా హీరో రామ్‌ చరణ్‌ తేజ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా స్పందించారు. 
 
అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ అని చెర్రీ అన్నారు. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలన్నారు.

అంతేగానీ చవకబారుతనంగా ప్రవర్తించకూడదని ఫేస్‌బుక్‌లో స్పందించారు. ఈ సందర్భంగా తన బాబాయ్, సినీనటుడు పవన్ కల్యాణ్ సహనంతో, ఓపికగా భరించాలని చెప్పే వీడియోను చెర్రీ పోస్టు చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీరెడ్డి కామెంట్స్ పైన స్పందించిన కొర‌టాల‌... అప్పుడెందుకు ఇప్పుడే...