పవన్ దమ్మున్న మగాడు.. ఆ వెధవల్ని చె.. కొట్టండి.. శ్రీరెడ్డి వ్యవహారం?: నాగబాబు
సినీ ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం అందరికీ అలవాటైపోయిందని.. టీవీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వుంది. కొందరు వెధవల వల్ల సినీ ఇండస్ట్రీ పేరు చెడిపోతుంది. సినిమాల్లో చెడు గురించి మాట్లాడేవారు మంచిని ఎందుకు గుర్తించ
సినీ ఇండస్ట్రీపై ఆరోపణలు చేయడం అందరికీ అలవాటైపోయిందని.. టీవీ రంగంలో కాస్టింగ్ కౌచ్ వుంది. కొందరు వెధవల వల్ల సినీ ఇండస్ట్రీ పేరు చెడిపోతుంది. సినిమాల్లో చెడు గురించి మాట్లాడేవారు మంచిని ఎందుకు గుర్తించరని సినీ నటుడు మెగా బ్రదర్ నాగబాబు ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కొందరు అనవసరంగా పని గట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని శ్రీరెడ్డిని ఉద్దేశించి నాగబాబు మండిపడ్డారు.
ఒకరి వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించే హక్కు ఎవరికీ లేదని నాగబాబు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన నాగబాబు.. తల్లిపై కామెంట్స్ చేస్తే ఎవరైనా ఊరకుంటారా? అమ్మాయి కాబట్టి వదిలిపెట్టేశామని నాగబాబు అన్నారు. ఏదైనా తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిరంగంగా చెప్పే దమ్మున్న మగాడు తన సోదరుడని.. తప్పు జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయమని సూచించడం తప్పా అంటూ నాగబాబు ప్రశ్నించారు.
కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే సినీ ఇండస్ట్రీని వదిలి పెట్టి.. ప్రజల్లోకి వెళ్ళిపోయాడని.. అలాంటి వ్యక్తిని విమర్శిస్తారా అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. తప్పు చేయని మనిషి అంటూ ఎవరూ ఉండరని, వ్యక్తిగతంగా ఎవరిని తవ్వినా దొరుకుతారని, కావాల్సింది అది కాదని అన్నారు. పవన్ నిశ్శబ్దాన్ని చేతగానితనంగా అనుకోవద్దని హెచ్చరించారు.
శ్రీరెడ్డి వ్యవహారంపై నాగబాబు స్పందిస్తూ.. కొద్దిరోజులుగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం. శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టింది. కో ఆర్డినేటర్లు లేకుండా పనిచేయడానికి కొంత సమయం పడుతుంది. ప్రపంచంలో ఓ భాగమే సినీ పరిశ్రమ. విభిన్నంగా వుండదు. తప్పు చేసిన వారిని చెప్పుతో కొట్టి పోలీసులకు అప్పగించండి.
క్యాస్టింగ్ కౌచ్ అనేది ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమేనని, ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశమేమీ కాదని నాగబాబు తెలిపారు. ''మా''లో సభ్యత్వం ఉన్న, సభ్యత్వం లేని లేడీ ఆర్టిస్టులపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చని, దేశంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొంతమంది వెధవలు వేధిస్తే చెప్పుతో కొట్టండి, అంతే తప్పా, ఇండస్ట్రీని చులకన చేసి మాట్లాడొద్దని నాగబాబు సూచించారు. మహిళలంటే తమకు ఎంతో గౌరవమని, తన కూతురుని కూడా సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చానని తెలిపారు.