Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సంధ్యా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను: జీవిత రాజశేఖర్ వార్నింగ్

గరుడ వేగ హీరో రాజశేఖర్.. ఆమె సతీమణి, నటి, నిర్మాత జీవిత రాజశేఖర్‌పై సామాజిక కార్యకర్త సంధ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్‌ వద్దకు ప

Advertiesment
సంధ్యా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోను: జీవిత రాజశేఖర్ వార్నింగ్
, మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (19:01 IST)
గరుడ వేగ హీరో రాజశేఖర్.. ఆమె సతీమణి, నటి, నిర్మాత జీవిత రాజశేఖర్‌పై సామాజిక కార్యకర్త సంధ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో హాస్టల్‌లోని అమ్మాయిలను తాను రాజశేఖర్‌ వద్దకు పంపుతున్నానని సంధ్య చేసిన వ్యాఖ్యలపై మంగళవారం మీడియా ముందు జీవిత రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. రాజశేఖర్ అమ్మాయిల పిచ్చోడని.. తాను బ్రోకర్ పని చేస్తున్నానని సంధ్య చేసిన కామెంట్స్‌ను అన్నీ యూట్యూబ్ వీడియో ఛానల్స్ రకరకాలుగా పోస్టు చేశాయని మండిపడ్డారు.
 
తనను చాలామంది మహిళలు ఇష్టపడుతున్నారని.. ఏపీ రాష్ట్రం మొత్తం తనను సొంతింటి ఆడపడుచులా చూస్తోందన్నారు. ఓ ఆడదానిపై ఓ మహిళ చేయాల్సిన ఆరోపణలా ఇవంటూ ప్రశ్నించారు. తనకు ఇద్దరు కుమార్తెలున్నారని.. తనది గొప్ప కుటుంబమని.. రాజశేఖర్‌ కుటుంబం అంటే ఐఏఎస్‌, ఐపీఎస్‌ల కుటుంబం. మాపై వేసిన ఆ ఆరోపణలను రుజువు చేయాల్సిందే. 
 
ఏ ఆధారాలతో ఇలా మాట్లాడుతున్నారో ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. ఈ వ్యవహారంపై కేసు పెడతానని, కోర్టుకెళ్లి తేల్చుకుంటానని స్పష్టం చేశారు. టీవీల్లో డిబేట్లు పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడితే తాను ఇక ఊరుకోనని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఇక్కడ ఎవ్వరూ చూస్తూ ఊరుకోరరని హెచ్చరించారు. శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? అని జీవిత ప్రశ్నించారు. సినిమా తీయాలంటే ఎంతగా ఖర్చు చేయాలో, ఎంతగా కష్టపడాలో నిర్మాతగా తనకు తెలుసునని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైట్ క్లబ్ అని తెలీదు.. అందుకే ప్రారంభించా : బీజేపీ ఎంపీ