Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇపుడే తెలిసిందా? నాగబాబు ప్రశ్న

తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం ఇపుడే తెలిసిందా? అంటూ మెగా బ్రదర్ నాగబాబు ప్రశ్నించారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చని హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాపై నట

Advertiesment
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇపుడే తెలిసిందా? నాగబాబు ప్రశ్న
, బుధవారం, 18 ఏప్రియల్ 2018 (14:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయం ఇపుడే తెలిసిందా? అంటూ మెగా బ్రదర్ నాగబాబు ప్రశ్నించారు. క్యాస్టింగ్ కౌచ్ బాధితులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించవచ్చని హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహాపై నటి శ్రీరెడ్డి ఘాటైన విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఈ విమర్శలపై దుమారం చెలరేగాయి. అలాగే, నాగబాబు కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఇదే అంశంపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, శ్రీరెడ్డి నిరసన పక్కదారి పట్టిందన్నారు. కాస్టింగ్ కౌచ్ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసని.. క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఇప్పుడే తెలిసిందా అని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో దేవుళ్లెవరూ ఉండరని, ఎవరైనా తక్కువగా మాట్లాడితే లాగిపెట్టి కొట్టాలన్నారు. ఆర్టిస్టులకు ఫిక్స్‌డ్ రేట్స్ లేవని, ఈ విషయంపై నిర్మాతలతో మాట్లాడి న్యాయం చేస్తామన్నారు. 
 
తెలుగు వారికే క్యారెక్టర్ ఇవ్వాలనేది.. సినిమా అవసరాన్నిబట్టి అది నిర్మాతల చేతుల్లో ఉంటుందని, మా అసోసియేషన్‌తో సంబంధం లేదన్నారు. రూ.కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు.. సో ఇది కుదరదనీ, ఎవరి టాలెంట్ వారిదేనని, మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా పనిచేసే హక్కు ఉందన్నారు. దేశంలో ఎవరి ఛాన్స్ వారిదేనని నాగబాబు స్పష్టంచేశారు.
 
ఇకపోతే, రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే విమర్శలు చేయండి, అంతేగానీ, వ్యక్తిగతంగా కామెంట్స్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పవన్ దీనిపై స్పందించలేదంటే చేతకాని పని అనుకోవద్దన్నారు. శ్రీరెడ్డి విషయంలో పవన్ మాట్లాడింది తప్పేముందన్నారు. దయచేసి తప్పుగా మాట్లాడద్దని, తమ తల్లిని అన్నందుకు మెగా ఫ్యామిలీ రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు. శ్రీరెడ్డి ఆడపిల్ల కావడంతో వదిలేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఇదే విషయంపై మా అమ్మ ఈ ఇష్యూని పెద్ద చేయవద్దని చెప్పిందన్నారు. ఈ విషయంపై మీడియాలో డిస్కషన్స్ పెట్టొదని నాగబాబు కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లీ బంగారుతల్లి అంటూ బట్టలిప్పించేశాడు... ఇండస్ట్రీలో 'డ్యాష్' ముండల్లేరా... అని అన్నారు... హేమ(Video)