Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాదుడు రెడ్డి వ‌ల్లే పెట్రోల్ ధ‌ర శ‌త‌కం...లోకేష్ ట్వీట్!

Webdunia
శనివారం, 17 జులై 2021 (14:35 IST)
ఏపీలో ప్రజల్ని జగన్ పీల్చి పిప్పి చేస్తున్నార‌ని, ఆకాశమే హద్దుగా ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు దూసుకెళ్తున్నాయ‌ని టీడీపీ నేత నారా లోకేష్ విమ‌ర్శించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు... పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చని నీతి కబుర్లు చెప్పిన బాదుడు రెడ్డి... ఇపుడు త‌నే అధికంగా ప‌న్నులు వేస్తున్నార‌ని లోకేష్ ఆరోపించారు.

ఇండియన్ పెట్రోల్ లీగ్‍లో రికార్డుల మోత మోగిస్తూ, పెట్రోల్ ధరను రూ.108, డీజిల్ ధరను రూ.100 చేసి.... బాదుడు రెడ్డి అనే పేరును సార్దకం చేసుకున్నార‌ని ఎద్దేవా చేశారు. 31 శాతం వ్యాట్+లీటర్‍కు రూ.4 అదనపు వ్యాట్+ లీటర్‍కు రూ.1 రోడ్డు అభివృద్ధి సుంకం అన్నీ వెరసి... ప్రజలపై బాదుడు రెడ్డి భారం లీటర్‍కు 30 రూపాయలు అని లెక్క తేల్చారు లోకేష్.

ప్రతిపక్షంలో ఉండ‌గా, పన్నులు తగ్గించుకుంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ఇవ్వొచ్చన్న బాదుడు రెడ్డి, ఇప్పుడు పన్నులు ఎందుకు తగ్గించడం లేదు? అని ప్ర‌శ్నించారు.  ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ అంటూ బోర్డు పెట్టారంటే, మీ దోపిడీ ఏ రెంజ్‍లో ఉందో అర్థమవుతోంది... ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్న మాటకు కట్టుబడి రాష్ట్ర పన్నుల భారాన్ని తగ్గించి తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments