Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిచ్చోడి చేతిలో రాయిలా124-ఏ సెక్షన్ : జస్టిస్ ఎన్వీ రమణ

పిచ్చోడి చేతిలో రాయిలా124-ఏ సెక్షన్ : జస్టిస్ ఎన్వీ రమణ
, గురువారం, 15 జులై 2021 (13:14 IST)
దేశ అత్యుతున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కాలం చెల్లిన చట్టాల అమలుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, సెక్షన్ 124-A (దేశద్రోహం నేరం కింద కేసు)పై సీజేఐ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
బ్రిటీష్ కాలంనాటి సెక్షన్ 124-A చట్టబద్దత భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందంటూ రిటైర్డ్ మేజర్ జనరల్ రిటైర్డ్ మేజర్ జనరల్ ఎస్.జీ వోంబట్ కేర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌‌పై విచారణ నిర్వహించింది. 
 
రాజద్రోహం కింద కేసు నమోదు చేసి.. సెక్షన్ 124-A పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. 124-A సెక్షన్ దుర్వినియోగం అవుతోందన్నారు. ఈ సెక్షన్ కింద శిక్షలుపడిన కేసులు కూడా నామమాత్రమేనన్నారు. ఫ్యాక్షనిస్టులు తమ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడగలుగుతారంటూ వ్యాఖ్యానించారు. 
 
రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి.. ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్న ఉదంతాలు ఉన్నాయన్నారు. ఇంకా ఎన్వీ రమణ స్పందిస్తూ, స్వాతంత్ర సమరయోధులను అణిచివేయడానికి.. బ్రిటీష్ వలస పాలకులు వాడిన ఈ చట్టం ఇంకా అవసరమా? పరిశీలించాల్సిన సమయం అసన్నమైంది. పాత కాలపు, పనికిమాలిన చట్టాలను తొలగించిన ప్రభుత్వం ఈ చట్టం జోలికి ఎందుకు వెళ్ళలేదు? కొయ్యను మల్చడానికి వడ్రంగి చేతికి రంపం ఇస్తే అడవిని నాశనం చేసినట్టు ఈ చట్టం ఉంది. 
 
వ్యవస్థలకు, వ్యక్తులకు ఈ చట్టం వల్ల తీరని నష్టం జరుగుతోంది. 124-A సెక్షన్ రద్దు చేయాలని ఎడిటర్ గిల్డ్ దాఖలు చేసిన పిటిషన్‌తో పాటు.. అన్నింటినీ కలిపి విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది. కేంద్రానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది అని అన్నారు. 
 
కాగా.. రాజద్రోహం కేసులు పెట్టడానికి వీలు కలిగిస్తున్న ఈ 124-A ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై  గురువారం నాడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టి పై విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ పెరిగిన బంగారం ధరలు