Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంకెంత మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకుంటారు?: లోకేష్

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (23:19 IST)
అమరావతి: రాష్ట్రంలో టీడీపీ నేతలు దారుణ హత్యలకు గురవడంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో  విరుచుకుపడ్డారు. ‘‘ప్ర‌శాంత‌ ప‌ల్లెల్ని కూడా ముఠాక‌క్ష‌ల కేంద్రాల్ని చేసిన ఫ్యాక్ష‌న్ సీఎం జగన్ రెడ్డి గారూ! మీ క‌క్ష‌పూరిత పాల‌న‌లో ఇంకెంత‌మంది టీడీపీ కార్య‌క‌ర్త‌ల్ని బ‌లి తీసుకుంటారు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త లక్కెపోగు సుబ్బారావుని వైసీపీ మూక‌లు హ‌త్య‌ చేయ‌డం అత్యంత దారుణమన్నారు. ఇంట్లో శుభ‌కార్యానికి డీజే పెట్టుకుంటే, ఓర్వ‌లేని వైసీపీ వ‌ర్గీయులు దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డారంటే, ఎంత‌గా బ‌రితెగించారో అర్థం అవుతోందన్నారు. సుబ్బారావు కుటుంబానికి, గాయ‌ప‌డిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ అన్నివిధాలుగా అండ‌గా నిలుస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments