Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తిరుపతికి వస్తున్న నారా భువనేశ్వరి

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (08:40 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సోమవారం తిరుపతి పర్యటనకు వస్తున్నారు. ఇటీవల సంభవించిన తిరుపతి వరదల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి, తగిన ఆర్థిక సాయం చేస్తారు. ఈ ఆర్థిక సాయం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేస్తారు. 
 
ఇటీవల తిరుపతిలో సంభవించిన వరదల్లో పదల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల కుటుంబాలను ఆమె పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేస్తారు. మొత్తం 48 మందికి నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో అధికార వైకాపా మంత్రులతో పాటు టీడీపీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కలిసి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దీంతో వల్లభనేని వంశీ మీడియా ముఖ్యంగా నారా భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. ఈ వివాదం తర్వాత ఆమె తొలిసారి తిరుపతి పర్యటనకు వస్తున్నారు.  

సంబంధిత వార్తలు

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments