Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దిశ ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు - సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్

దిశ ఎన్‌కౌంటర్‌కు రెండేళ్లు - సీన్ రీకన్‌స్ట్రక్షన్ పేరుతో ఎన్‌కౌంటర్
, సోమవారం, 6 డిశెంబరు 2021 (11:25 IST)
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ ఎన్‌కౌంటర్ జరిగి డిసెంబరు ఆరో తేదీకి రెండు సంవత్సరాలు. గత యేడాది నవంబరు 28వ తేదీ రాత్రి ఓ వెటర్నరీ వైద్యురాలిని కిడ్నాప్ చేసి అత్యాచారం, ఆపై హత్య చేశారు. ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి కాల్చేశారు. ఈ కేసులో నలుగురు కామాంధులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దీనికి దిశా ఎన్‌కౌంటర్‌గా పేరు పెట్టారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఘటనా స్థలానికి నిందితులను సైబరాబాద్ పోలీసులు తీసుకెళ్లారు. కానీ, వారు పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరుపగా, ఆ నలుగురు నిందితులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరుగా సజ్జనార్ ఉన్నారు. ఈ ఎన్‌‍కౌంటరుతో ఆయన పేరు మార్మోగిపోయింది. 
 
ఇదిలావుంటే, దిశ ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ గత రెండేళ్లుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే అనేక మంది వద్ద ఈ కమిషన్ విచారణ జరిపింది. అలాగే, ఆదివారం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని కూడా ఈ కమిషన్ సభ్యులు సందర్శించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాగాలాండ్ పౌరులపై ఉద్దేశ్వపూర్వకంగా కాల్పులు!!