Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరిగిన గ్రామం!

Advertiesment
60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరిగిన గ్రామం!
, సోమవారం, 15 నవంబరు 2021 (12:00 IST)
60 యేళ్ల తర్వాత తొలిసారి పంచాయతీ పోల్ జరుగిన గ్రామం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు కావొస్తుంది. కానీ, ఇక్కడ 60 యేళ్ళుగా ఎన్నికలు జరుగలేదు. ఇపుడు ఆ పంచాయతీ ఎన్నిక జరిగింది. 
 
కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరం పంచాయతీ అది. ఇప్పటివరకు ఇక్కడ ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగేవి. కానీ, ఈ దఫా మాత్రం తొలిసారి రెండు వర్గాలు పోటీకి దిగాయి. దీంతో ఎన్నిక అనివార్యమైంది. 
 
లక్కసాగరం పంచాయతీ ఆవిర్భావం నుంచి ఎన్నికలు జరగలేదు. ఈ పంచాయతీ ఎవరికి రిజర్వు అయినా ఇప్పటివరకు గ్రామస్థులందరూ కలిసి ఏకగ్రీవం చేస్తూ వచ్చారు. గ్రామంలో 2,375 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్ష్మీదేవి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల ఆమె మృతి చెందడంతో ఎన్నిక అనివార్యమైంది. 
 
ఈ నేపథ్యంలో గత సంప్రదాయానికి భిన్నంగా సర్పంచ్ పదవి కోసం రెండు వర్గాలు పోటీ పడ్డాయి. దీంతో ఆదివారం జరిగిన ఎన్నికలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి వర్గానికి చెందిన ఎం.వరలక్ష్మి 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేఎంసీ వైద్య కాలేజీ ర్యాగింగ్ కలకలం.. ప్రధాని - హోం మంత్రికి లేఖ