Webdunia - Bharat's app for daily news and videos

Install App

NTR పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య.. ఎవరిష్టం వారిది...

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (11:49 IST)
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. గురువారం ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలనేది ఎవరిష్టం వారిది అన్నారు.
 
ముఖ్యంగా, చాలాకాలంగా చర్చనీయాంశంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు. ఈ రోజుల్లో ఎవరిష్టాలు వారివని, వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు.
 
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై తాను పెద్దగా ఆలోచించడంలేదని, అయినా, టీడీపీ ఒక ఆవేశంలోంచి పారదర్శక రీతిలో పుట్టిన పార్టీ అని, అందులో పారదర్శకంగా ఉండేవాళ్లకే గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు. 
 
ఇక, ఎన్టీఆర్ టీడీపీలోకి వస్తే పార్టీకి ప్లస్ అవుతుందా? అని యాంకర్ ప్రశ్నించడంతో, బాలయ్య సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు. చిరునవ్వే ఆయన సమాధానం అయింది. ఆమె రెట్టించడంతో... "ప్లస్ అయి మైనస్ అయితే!" అంటూ తనదైన శైలిలో ఎదురు ప్రశ్న వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments