Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీతో, మీ ఎమ్మెల్యే... ఆర్.కె.రోజా

Webdunia
శుక్రవారం, 17 డిశెంబరు 2021 (12:15 IST)
ఎమ్మెల్యే రోజా త‌న నగరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లకు మ‌రింత ద‌గ్గ‌ర అయ్యేందుకు కొత్త కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. అదే మీతో మీ ఎమ్మెల్యే. శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా పుత్తూరు మునిసిపాలిటీ ఎనిమిదవ వార్డులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు, ప్రజాసమస్యల పరిష్కారం కోసం "మీతో మీ ఎమ్మెల్యే" కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.
 
 
పుత్తూరు మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులోని శీలక్కార వీధి, తాటితోపు వీధి, వత్తవాడవీధి, మొహమ్మద్ వీధి, మసీదు వీధి, మేదర వీధి, బలిజ వీధి, గేట్  వీధి, దాసరి గుంట వీధి, రీడింగ్ రూం వీధులలో పర్యటించి,  ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రజా సమస్యల ప‌రిష్కారానికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యం ఇచ్చారు.
 
 
వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత పెన్షన్లు, వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం అమలు, చిన్నారుల తల్లితండ్రులకు అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, వైయస్సార్ చేయూత, డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ప్రతి కుటుంబంలో ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకోసం అమలు చేస్తున్న ఓ.టి.ఎస్ పథకం గురించి వివరించారు. తాగునీటి సమస్యలు రాకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజాకి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది వైఎస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments