Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాక్టరుగా మారిన ఎమ్మెల్యే ఆర్కే.రోజా!

Webdunia
ఆదివారం, 19 డిశెంబరు 2021 (17:34 IST)
సినీ నటి, అధికార వైకాపాకు చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా డాక్టరయ్యారు. చేతిలో స్టెతస్కోప్ పెట్టుకుని పలువురు చిన్నారులను పరీక్షించారు. ఆ తర్వాత తనకు డాక్టర్ అవ్వాలన్న కోరిక ఈ విధంగా తీర్చుకున్నట్టు సరదాగా వ్యాఖ్యానించారు. 
 
ఆమె ఆదివారం పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్బంగా మెడలో స్టెతస్కోప్ వేసుకుని పలువురు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ నార్మల్, షుగర్ నార్మల్ అంటూ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనకు చిన్నవయసులో డాక్టర్ కావాలన్న కోరిక బలంగా ఉండేదన్నారు. కానీ, డాక్టర్ కాలేక యాక్టర్‌ను అయినట్టు చెప్పారు. తిరుపతిలోని పద్మావతి ఉమెన్స్ కాలేజీలో బైపీసీ స్టూడెంట్‌గా తాను పాస్ అయినట్టు చెప్పారు. ఆ తర్వాత వైద్య సీటు కోసం ప్రవేశ పరీక్ష కూడా రాశానని, కానీ తనకు సినిమాల్లో అవకాశం రావడంతో అన్నీ వదిలేసి ఈ సినిమా రంగంలోకి వెళ్లినట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments