Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాట్సప్‌లో అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే..?

వాట్సప్‌లో అన్ నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తే..?
, గురువారం, 9 డిశెంబరు 2021 (13:32 IST)
వాట్సప్‌లో అన్ నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. అయినా ఆ ఆయుర్వేద వైద్యుడు అటెండ్ చేశాడు. తీరా కాల్ కనెక్ట్ అయిన వెంటనే అవతలినుంచి ఓ మహిళ ఒక్కొక్కటిగా తన దుస్తుల్ని తీసేసింది, నగ్నంగా మారిపోయింది. అసలేం జరిగిందో, ఏం జరిగిందో అర్థం కాక ఆ ఆయుర్వేద డాక్టర్ కాల్ కట్ చేశారు. ఆ తర్వాత వెంటనే వాయిస్ కాల్ వచ్చింది. 
 
నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారని.. వీడియోలు కూడా పంపారు. అంతే కాదు.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారందరికీ ఈ వీడియో వెళ్తుంది అని బెదిరించారు. అయితే ఇక్కడ డాక్టర్ బెదిరిపోలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో అంటూ ఫోన్ కట్ చేశారు.
 
నెల్లూరుకి సంబంధించి మరో విలేకరి స్నేహితుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అతను కూడా భయపడకుండా.. వారిని రివర్స్‌లో బెదిరించే సరికి వ్యవహారం అక్కడితో ఆగింది.
 
ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోనే కాదు.. చాలా చోట్ల ఇలాంటి ఆన్ లైన్ వేధింపులు మొదలయ్యాయని తెలుస్తోంది. చాలా వరకు బాధితులు గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు సమర్పించుకుంటూనే ఉన్నారు. మరికొంతమంది మాత్రం మోసగాళ్ల బారినపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి కాల్స్‌పై సైబర్ క్రైమ్ దృష్టి సారిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలుగులో మావోయిస్టుల పోస్టర్లు కలకలం... ఇన్ఫార్మర్లకు వార్నింగ్