భీమవరానికి రాని ఆర్ఆర్ఆర్ - రైలు దిగి వెనక్కి పయనం

Webdunia
సోమవారం, 4 జులై 2022 (08:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం పర్యటించనున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వస్తున్నట్టు ప్రకటించారు. కానీ, ఆయన ఈ కార్యక్రమానికి రాకుండానే వెనక్కి వెళ్ళారు. 
 
ప్రధాని మోడీ పర్యనటలో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న రఘురామ.. అక్కడ నుంచి భీమవరం వెళ్లేందుకు గత రాత్రి హైదరాబాద్ నగరంలో రైలు ఎక్కారు. ఈ క్రమంలో ఆయనకు ఓ ఫోన్ వచ్చింది. 
 
శనివారం ఆయనకు మద్దతుగా భీమవరంలో ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారన్నది సమాచారం. యువకుల తల్లిదండ్రులో ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. 
 
దీంతో మనస్తాపం చెందిన రఘురామ మధ్యలోనే రైలు దిగి వెనక్కి వెళ్లిపోయారు. ప్రొటోకాలో విషయంలో అధికారులు తనకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. యువకులపై కేసు పెట్టడం రఘురామను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. అందుకే భీమవరం రాకుండా ఆయన వెనక్కి వెళ్లిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments