Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్ సింగ్?

Advertiesment
amarinder singh
, ఆదివారం, 3 జులై 2022 (18:25 IST)
ఉపరాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ అభ్యర్థిగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ (80)ను బరిలోకి దించనున్నారనే వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పదవికి 18న ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ఆగస్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది.
 
అయితే, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థిగా ఒడిశా గిరిజన సభ్యురాలు, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపతి ముర్ముని ప్రకటించింది. ప్రతిపక్ష పార్టీల సాధారణ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించారు.
 
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, నామినేటెడ్ ఎంపీలు ఓటేయనున్నారు. బలాబలాల దృష్ట్యా బీజేపీ బరిలోకి దిగిన అభ్యర్థి గెలుపొందడం ఖాయమని తేలిపోయింది. 
 
మరోవైపు, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల రేసులో కాంగ్రెస్ అసమ్మతి నేత గులాంనబీ ఆజాద్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇపుడు కాంగ్రెస్‌ మాజీ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రతిపాదించే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
 
ఆ తర్వాత పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీని ప్రారంభించిన అమరీందర్ సింగ్.. బీజేపీతో పొత్తు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వెన్ను నొప్పికి చికిత్స చేయించుకునేందుకు యూరప్ దేశమైన లండన్, బ్రిటన్ వెళ్లారు. ఇటీవలే ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనను ఫోన్‌లో సంప్రదించి ఆరోగ్యంపై ఆరా తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా పేరు మార్చుతారా?