Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో దళితులపై పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీకావు: మొహమ్మద్ నసీర్ అహ్మద్

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (08:52 IST)
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీలపై దాడులు నిత్యకృత్యాల య్యాయని,  చిత్తూరుజిల్లాలో మంత్రిపెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి కుటుంబంచేస్తున్నదురాగతాలు మరీ పెచ్చుమీరాయని, చిన్న పిల్లాడిని అడిగినా పెద్దిరెడ్డికుటుంబం ఆకృత్యాలు గురించి చెప్పే పరిస్థితి ఏర్పడిందని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి మొహమ్మద్ నసీర్ అహ్మద్ స్పష్టంచేశారు.

ఆయన తననివాసం నుంచి  జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయతీరాజ్ శాఖా మంత్రిగాకాకుండా, పంచాయితీలుచేసే మంత్రిగానే రాష్ట్రవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు పొందారని నసీర్ అహ్మద్ ఎద్దేవాచేశారు.

పేదలంతా ఉపాధికోల్పోయి, తిండిలేక అవస్థలుపడుతుంటే, ఇసుకపాలసీ అనేది సక్రమంగా తీసుకురాకుండా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90మంది కార్మికులను పొట్టనబెట్టుకున్న ఘనత పెద్దిరెడ్డికే దక్కుతుందన్నారు. కృత్రిమఇసుక కొరతను సృష్టించి, కోట్లు దండుకుంటూ, లక్షలాదిమందిని రోడ్డునపడేసిన మహాను భావుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చరిత్రకెక్కాడన్నారు. 

తనసొంత జిల్లాకు ఇప్పటివరకు ఒక్కపరిశ్రమను, చిన్న కంపెనీని కూడా తీసుకురాని మంత్రిపెద్దిరెడ్డి, అధికారమనే మత్తులో జోగుతూ, కాంట్రాక్ట్ సంస్థల ముసుగులో కోట్లాదిరూపాయల ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నాడని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్సంటేజీలు దక్కకపోతే, ఆరోజు రామచంద్రారెడ్డికి నిద్రకూడా పట్టదన్నారు.

దళితులను పట్టుకొని వాడూవీడూ అని దుర్భాషలాడినందుకు, జడ్జిరామకృష్ణను, అతనికుటుంబాన్ని వేధించినందుకు, ఓంప్రతాప్ చావుకుకారణమైనందుకు, పెద్దిరెడ్డికి, అతని కుటుంబానికి తగినవిధంగా బుద్దిచెప్పడానికి చిత్తూరులోని దళితులు సిద్ధంగా ఉన్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డికి బినామీలామారిన పెద్దిరెడ్డి, రాష్టప్రజల సొమ్ముని బకాసురుడిలా మింగేస్తున్నాడన్నారు. స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లేధైర్యం లేని మంత్రిపెద్దిరెడ్డి, అతని ప్రభుత్వం పనిగట్టుకొని మరీ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నాయన్నారు.

చంద్రబాబు తనతో పోటీకి రావాలని పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి అనడం విడ్డూరంగా ఉందని, అలాఅనేముందు మంత్రితనస్థాయి ఏమిటో తెలుసుకుంటే మంచిదని టీడీపీనేత హితవుపలికారు. జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో చెప్పలేనని అరాచకాలు, లెక్కలేనంత అవినీతి జరుగుతోందన్నారు. 

స్థానికఎన్నికలు నిర్వహించాలనికోర్టులు, ఎన్నికల కమిషన్  చెబుతున్నా, వినిపించుకోకుండా ముఖ్యమంత్రి,  ఆయనమంత్రులు పారిపోతున్నారని నసీర్ అహ్మద్ ఎద్దేవాచేశారు. తనశాఖపరిధిలోని ఇసుక సమస్యను తీర్చలేని మంత్రి పెద్దిరెడ్డి, ఇతరులకు నీతులు చెప్పడం సిగ్గుచేటన్నారు.

ప్రభుత్వాన్నిప్రశ్నించి వారిపై దాడులకు తెగబడటం, పెద్దిరెడ్డి నైజంగా మారిందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు తెగబడుతూ మంత్రి పెద్దిరెడ్డి పెద్ద కులఅహాంకారిగా మారాడన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచిస్తే, పంచాయితీలు, సెటిల్మెంట్లు చేసే మంత్రిగా పెద్దిరెడ్డి సుపరిచితుడయ్యాడన్నారు.

జగన్ జైలుకు వెళ్లగానే, ముఖ్యమంత్రి సీటుని హస్తగతం చేసుకోవాలన్న దురాలోచనలో ఉన్నపెద్దిరెడ్డి, కావాలనే  చంద్రబాబుపై చౌకబారు విమర్శలుచేస్తున్నాడని నసీర్ అహ్మద్ స్పష్టంచేశారు. చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం రెండూపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేవనే విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు.

గెలుపుపై మంత్రిపెద్దిరెడ్డికి అంతటి విశ్వాసమే ఉంటే, ఆయన తక్షణమే జగన్మోహన్ రెడ్డిని స్థానికఎన్నిలకు ఒప్పించాలని నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. మైనారిటీలు, ఎస్సీలపై దాడులుజరుగుతుంటే నోరు తెరవడం చేతగాని రామచంద్రారెడ్డి, తాను మంత్రి అయ్యాక చిత్తూరుజిల్లాకు వీసమెత్తుకూడా సాయం చేయలేదన్నారు.

ఆఖరికి ప్రభుత్వం ప్రజలపొట్టకొట్టే కార్యక్రమానికి తెరలేపిందని, రేషన్ కార్డులు తొలగించాలనే అమానుష క్రీడకు పాల్పడటం దారుణాతి దారుణమని టీడీపీనేత ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకత్వంతో పాలన సాగించడం, ప్రజలను మభ్యపెట్టడమనే విధానాలతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందితప్ప, ఎక్కడా అభివృద్ధి అనేది మచ్చుకైనా కనిపించడంలేదన్నారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గోతులుగామారితే వాటిని గురించి పట్టించుకోకుండా, పెద్దిరెడ్డి తనపరిధి దాటి మాట్లాడుతున్నాడన్నారు.

వైసీపీ ప్రభుత్వంలో అన్యాయంగా బలైన ముస్లిం కుటుంబాలను పట్టించుకోకుండా అవినీతి, దాడులను నడుపుతున్న ముఖ్యమంత్రి ఒకవైపుంటే, నిత్యం ప్రజలగురించి, రాష్ట్రం గురించి ఆలోచించే చంద్రబాబు మరోవైపుఉన్నాడన్నారు. పనికిరాని ఇసుకపాలసీతో రాష్ట్రంలోని కార్మిక వర్గాలను పొట్టనబెట్టుకున్న ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కుతుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments