Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంత్రి పెద్దిరెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం: తెలుగురైతు విభాగం

మంత్రి పెద్దిరెడ్డి తగిన మూల్యం చెల్లించుకోవడం ఖాయం: తెలుగురైతు విభాగం
, శనివారం, 12 డిశెంబరు 2020 (06:45 IST)
చిత్తూరుజిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని, కురబలకోట మండలంలో టీడీపీనేతలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, రెడ్డివారి శ్రీనివాసులరెడ్డి, శంకర్ యాదవ్, ఇతర టీడీపీనేతలు, కార్యకర్తలపై  జరిగినదాడి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న అరాచక పాలనకు సంకేతంగా నిలిచిందని టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీనేతలపై జరిగిన దాడిలో ప్రజాస్వామ్య వ్యతిరేకవిధానాలు, పాలకులు నియంత్రత్వం, ఫాసిస్టు ధోరణిస్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అధికారపార్టీకి ఊడిగం చేస్తూ, ప్రభుత్వం అవసరాలు తీరేలా పనిచేయడమనేది గర్హించాల్సిన విషయమని శ్రీనివాసరెడ్డి తేల్చిచెప్పారు.

ఒక నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న టీడీపీనేతలపై దాడిచేయడం ఏమిటన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మూడేళ్లపాలు పరామర్శలపేరుతో ఓదార్పుయాత్ర చేశాడని, ఆనాడు అధికారంలో ఉన్న టీడీపీ ఏనాడూ ఆటంకం కలిగించ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు ఎలా వ్యవహరించారో, ఈనాడు ఎలా వ్యవహరిస్తున్నారో వారే ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిదని టీడీపీనేత హితవుపలికారు.

కుప్పుస్వామి, రమేశ్ స్వామి, శంకర్ నాయుడు అనే టీడీపీ కార్యకర్తలు చనిపోతే, వారికుటుంబసభ్యులను పరామర్శించడానికి వెళుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి చెందిన 200మంది వైసీపీ గూండాలు అకారణంగా దాడికి పాల్పడ్డారన్నారు.

టీడీపీవారిపై రాళ్లు, కర్రలతోదాడి చేయడమే కాకుండా, వారివాహనాలనుకూడా ధ్వంసం చేశారన్నారు. అంతటి దాడి జరిగితే, దాడిచేసిన వారిని వదిలేసి, దాడికిగురైనవారిని పోలీసులు వెనక్కు పంపించార న్నారు. పోలీసులు దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసుపెట్టకుండా, టీడీపీ వారిని  నిలువరించడమేంటని శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. డీజీపీ తక్షణమే జరిగినవ్యవహారంపై జోక్యం చేసుకోవాలన్నారు.

అధికారమదంతో నిన్నటికి నిన్న వైసీపీమహిళానేత టోల్ గేట్ సిబ్బందిపై దాడిచేస్తే, నేడు ఆమె అల్లుడు దాచేపల్లిలో ఆసుపత్రి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడన్నారు డీజీపీ వెంటనే స్పందించి, చిత్తూరులో టీడీపీవారిపై దాడిచేసిన వారిని కఠినంగా శిక్షించాలని మర్రెడ్డి డిమాండ్ చేశారు. అలా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనప్రదర్శనలకు దిగుతాయన్నారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లుగా వ్యవహరి స్తున్నాడని, దళితయువకుడు ఓంప్రకాశ్ ని చంపించాడని, నేడు టీడీపీవారిపై దాడిచేయించాడన్నారు. మంత్రి పెద్దిరెడ్డి ఆయన కుటుంబం ఇలానే వ్యవహరిస్తే, భవిష్యత్ లో తగినమూల్యం చెల్లించుకుం టుందని శ్రీనివాసరెడ్డి తీవ్రస్వరంతో హెచ్చరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దర్గాల సంరక్షణకు కట్టుబడి వున్నాం: మంత్రి వెల్లంపల్లి