Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దర్గాల సంరక్షణకు కట్టుబడి వున్నాం: మంత్రి వెల్లంపల్లి

దర్గాల సంరక్షణకు కట్టుబడి వున్నాం: మంత్రి వెల్లంపల్లి
, శనివారం, 12 డిశెంబరు 2020 (06:43 IST)
రాష్టంలో దర్గాల సంరక్షణకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి వుంటుందని దేవదాయ ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతొ చారిత్రాత్మక దర్గాలను ధ్వంసం చేసి ముస్లింల మనోభావాలను దెబ్బతీసి తగిన మూల్యం చెల్లించిందని పేర్కొన్నారు.

శుక్రవారం సాయంత్రం ప్రకాశం బారేజి సమీపములో ఉన్న హజరత్ అలీ హుస్సెన్ షా ఖాద్రీ ఉరుసు ఉత్సవంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు . ఉరుసులో ఫ్రభుత్వం తరపున చాదర్ ను బాబావారి సమర్పించారు.

సుఫి మత గురువులు హజరత్ అల్తఫ్ అలీ రజా మంత్రి వెల్లంపల్లిని సదర స్వాగతం పలికి, ఇస్లాం సంప్రదాయం ప్రకారం సత్కరించారు. ప్రత్యేక దువ్వా చేయించారు. బాబావారి ఆశీస్సులను అందించారు.

ఈ సందర్బంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన హజరత్ అలీ హుస్సెన్ షా ఖాద్రీ దర్గా, హజరత్ హుస్సెన్ షా ఖాద్రీ దర్గాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

దుర్గ ఫ్లయ్ ఒవర్ నిర్మాణం కారణంగా దర్గాలు కొంత భాగం వినియోగంలో తీసుకోవడం జరిగిందని, ప్రతిఫలంగా దర్గాలను  ఒక మంచి ప్లాన్ ప్రకారం అభివృద్ది చెయ్యడం ప్రారంభించామన్నారు. కొద్దీ నెలల్లోనే ఈ దర్గాలు సర్వాంగ సుందర పర్యటక ప్రాంతాలుగా విరాజిల్లుతాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వందేళ్ల తరవాత దేశంలోనే తొలిసారిగా రీ సర్వే: ధర్మాన కృష్ణదాస్