Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్: మంత్రి పెద్దిరెడ్డి

Advertiesment
sand mafia
, శుక్రవారం, 20 నవంబరు 2020 (08:58 IST)
రాష్ట్రంలో ఇసుక మాఫియాకు చెక్ పెడుతూ నూతన ఇసుక పాలసీ ద్వారా వినియోగదారులకు మెరుగైన ఇసుకను అందించాలన్న ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర భూగర్భగనులు, పిఆర్‌అండ్ ఆర్‌డి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద మీడియా పాయింట్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక రీచ్‌లను కేంద్రప్రభుత్వ సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయించారని తెలిపారు. ఈ మేరకు ఎనిమిది కేంద్ర సంస్థలకు డిఎంజి లేఖలు రాసిందని వెల్లడించారు.

దీనిలో ఎన్‌ఎండిసి, ఎంఎస్‌డిసిలు ఇసుక రీచ్‌లను నిర్వహించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ రెండు సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని, వీటిలో తక్కువ కోట్  చేసిన సంస్థకు నిబంధనల మేరకు ఇసుక రీచ్‌లను అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దీనిని వక్రీకరిస్తూ కొందరు ప్రైవేటు  వ్యక్తులకు ఇసుక రీచ్‌లను కట్టబెడుతున్నామని చంద్రబాబు తనకు అనుకూలమైన ఎల్లో మీడియాలో తప్పుడు విమర్శలు చేశారని అన్నారు. చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో తనకు మిత్రుడైన శేఖర్‌రెడ్డిని తీసుకువచ్చారని, టిటిడి సభ్యుడిగా కూడా అవకాశం కల్పించాని గుర్తు చేశారు.

సదరు శేఖర్‌రెడ్డికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఇస్తోందంటూ ఊహాగానాలతో చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. మీ హయాంలో జరిగిన దోపిడీని మేం సరిచేస్తుంటే చంద్రబాబు సహించలేక ఎల్లో మీడియా ద్వారా తప్పుడు ఆరోపణలకు దిగజారాడని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం ... ఎక్కడుందో తెలుసా?