Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం - ఏపీలో విస్తారంగా వర్షాలు

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (10:05 IST)
నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 
 
ఇప్పటికే దక్షిణ తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఈ వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో విద్యాసంస్థలకు కూడా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాలకు సెలవు ప్రకటించింది. 
 
ఇదిలావుంటే, ఈ ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తాయన అమరావత వాతావణ కేంద్రం తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు చేసింది. 
 
మరోవైపు, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి మొదలైన వర్షం నిన్నంతా కురుస్తూనే ఉంది. దీంతో తోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 
 
బుధవారం కూడా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మంగళవారం జిల్లా వ్యాప్తంగా 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోగోలులో అత్యధికంగా 138.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments