విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరు మార్పునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేశారు. దీంతో పేరు మార్పునకు సంబంధించిన బిల్లు చట్టంగా రూపాంతరం చెందింది.
కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎన్టీఆర్ హెల్త్ యూనవర్శిటీ పేరును డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చుతూ వైకాపా ప్రభుత్వం ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న బలం ఆధారంగా పూర్తి మెజార్టీతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును ఆమోదించాలని రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌కు ప్రభుత్వం పంపించింది. దీన్ని పరిశీలించిన గవర్నర్ సోమవారం ఆ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. కాగా, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం తెలుపడంతో ఈ బిల్లును చట్టంగా మారుసస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫలితంగా సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును అధికారికంగా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మారిపోయింది.