Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:41 IST)
ఉత్తరాంధ్రని చెరబట్టిన తాలిబన్ విజయసాయిరెడ్డి అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. శుక్రవారం జూమ్ యాప్ ద్వారా విజ‌య‌వాడ‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో ఎవరైనా భూ ఆక్రమణకు పాల్పడితే తనకు ఫిర్యాదు చేయాలని సీఎం చెబుతున్నారు. విజయసాయిరెడ్డి మొత్తం భూ ఆక్రమణకు పాల్పడుతున్నారు ఎవరికి ఫిర్యాదు చేయాలని ఆయన ప్రశ్నించారు. 
 
రూ.42 వేల కోట్ల ఈడీ జప్తు చేసిన కేసుల్లో దొంగ లెక్కలు రాసింది ఆడిటర్ విజయసాయిరెడ్డి అని అందరికీ తెలుసన్నారు. ఇతర ప్రాంతాల నుండి గూండాలను తెచ్చి ఉత్తరాంధ్రలో ఉంచి వారిని పెంచి పోషిస్తున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. ఉత్తరాంధ్రకు వలస వచ్చిన బందిపోటు విజయసాయిరెడ్డి. వైసీపీ మోసాలు, దురాగతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేవి పచ్చమీడియా, తీసుకెళ్లనివి మంచి మీడియానా? అని ప్రశ్నించారు. 
 
సర్పంచు  నుంచి ముఖ్యమంత్రి దాక జరిగిన అవినీతి, అక్రమాల గురించి తన పత్రికల్లో ఎక్కడా ఒక్క ముక్క రాయలేదు. చంద్రబాబునాయుడంటే ప్రాణాలిచ్చేవారు రాష్ట్రంలో అనేకమంది ఉన్నారన్నారు.  చంద్రబాబు, లోకేశ్ లను తిడితే జగన్ వద్ద మార్కులు పడతాయని, మంత్రి పదవుల కాల పరిమితి పెరుగుతుందని తిట్టడం ఇదంతా వృధా ప్రాయాసేనని, ఈ పద్ధదిని మానుకోవాలన్నారు. 
 
13 కేసుల్లో ముద్దాయిగా ఉండి, రూ.43 వేల కోట్ల ఈడీ కేసుల్లో ఏ-2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి నీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. విజయసాయిరెడ్డికి ఎర్రగడ్డ ఆసుపత్రికి పంపించి మానసిక చికిత్స చేయించాల్సిన అవసరముందన్నారు.  వైసీపీ చేసిన అవినీతి దందాలపై విజయసాయిరెడ్డిని చర్చకు జగదాంబ సెంటర్ వద్దకు పిలుస్తున్నాను. దమ్ముంటే రమ్మని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి మీడియా ముందు అవాకులు, చవాకులు పేల్చకుండా ఉంటే బాగుంటుందని హెచ్చరించారు. మేం అధికారంలోకి వచ్చాక విజయసాయిరెడ్డిచే తిన్నదంతా కక్కిస్తామని ఎమ్మెల్సి బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెన్నైలో అల్లు అర్జున్, శ్రీలీల 'పుష్ప 2 ది రూల్' మూడవ సింగిల్ 'కిస్సిక్' రిలీజ్

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments