సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ర్యాలీలు, ధర్నాలతో ఉద్యోగులు ఆందోళనలకు దిగారు. 
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానంతో ఉద్యోగులకు పింఛన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో సీపీఎస్ రద్దు హామీ ఇచ్చారని.. దాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. 
 
									
										
								
																	
	 
	వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్లుగా ఎదురుచూసినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళనబాట పట్టినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తమ ఆందోళనలను మరింతగా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	జగన్ సర్కారుకు వ్యతిరేకంగా తొలిసారి ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. సీపీఎస్ రద్దుపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.