Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైత్ర నిందితుడు రాజు ఆత్మహత్య...రైలు ప‌ట్టాల‌పై మృత‌దేహం!

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (11:21 IST)
గ‌త వారం రోజులుగా తెలంగాణా పోలీసులు వెతుకుతున్న హ‌త్యాచార నిందితుడు రాజు చివ‌రికి రైలు ప‌ట్టాల‌పై శ‌వ‌మై తేలాడు. సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృత దేహం కనిపించింది.  చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
చిన్నారిపై అమానుషంగా హ‌త్యాచారం చేసిన రాజు క‌నిపిస్తే, ఆచూకీ అందిస్తే, 10 ల‌క్ష‌ల రూపాయ‌ల బ‌హుమ‌తిని కూడా తెలంగాణా పోలీసులు ప్ర‌కటించారు. మరో ప‌క్క రాజుని ఎన్ కౌంట‌ర్ చేయాల‌ని ప్ర‌జా సంఘాలు, చిన్నారి బంధువులు డిమాండు చేసారు. ఈ ద‌శ‌లో రాజు ప్రాణాల‌తో దొరికి ఉంటే, పెద్ద సంచ‌ల‌న‌మే అయ్యేది. కానీ, నిందితుడు రైలు ప‌ట్టాల‌పై శవ‌మై క‌నిపించ‌డంతో పోలీసులు ఆత్మ‌హ‌త్య‌ కేసు న‌మోదు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments