బాలికను గర్భవతిని చేసిన తాత... ఎక్కడ?

విశాఖపట్టణం జిల్లాలో ఓ తాత మృగాడయ్యాడు. అభంశుభం తెలియని ఓ బాలికపై ఒక యేడాదిగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు. ఫలితంగా 13 యేళ్ళ బాలికను గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (10:08 IST)
విశాఖపట్టణం జిల్లాలో ఓ తాత మృగాడయ్యాడు. అభంశుభం తెలియని ఓ బాలికపై ఒక యేడాదిగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు. ఫలితంగా 13 యేళ్ళ బాలికను గర్భవతిని చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జీవీఎంసీ 50వ వార్డు పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన యెర్రిపిల్లి నూకరాజు (53)కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరు పిల్లలకూ వివాహాలు జరిపించాడు. పైగా, ఇద్దరు మనుమలు కూడా ఉన్నారు. స్థానికంగా ఉండే మట్టిపనులకు వెళ్లే నూకరాజు.. తమ ఇంట్లోకి టీవీ చూసేందుకు వచ్చే 13 యేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఓ యేడాదిగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. 
 
ఈ క్రమంలో బాలికతో పాటు బాలిక శరీరంలో మార్పులు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు.. ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో వారు నిర్ఘాంతపోయే నిజం వెల్లడైంది. ఆ బాలిక ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులు ఏం జరిగిందని అడిగేసరికి విషయమంతా చెప్పింది. బాధితులు శుక్రవారం రాత్రి న్యూపోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలికను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
ఈ యేడాది జనవరి నుంచి అత్యాచారం చేస్తున్నాడని, ఇంటికి వెళ్లిన ప్రతిసారి తినడానికి ఏదో ఒకటి ఇచ్చేవాడని, అప్పుడప్పుడు రూ.20 ఇస్తుండేవాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడని బాలిక చెప్పినట్టు తెలిసింది. దీంతో నూకరాజును పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం