Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళల మర్మాంగాల్లోకి చెట్టు కొమ్మను, తుపాకీని, నమిలే పొగాకును చొప్పించారు.. ఎక్కడ?

జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతి జిల్లా చోచాంజి గ్రామంలో ఐదుగురు మహిళలపై జరిగిన సామూహిక లైంగికదాడిలో దారుణమైన నిజాలు వెలుగుచూశాయి. మహిళలను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు చిత్రహింసలకు గురిచేసి ద

Advertiesment
మహిళల మర్మాంగాల్లోకి చెట్టు కొమ్మను, తుపాకీని, నమిలే పొగాకును చొప్పించారు.. ఎక్కడ?
, ఆదివారం, 24 జూన్ 2018 (09:49 IST)
జార్ఖండ్ రాష్ట్రంలోని కుంతి జిల్లా చోచాంజి గ్రామంలో ఐదుగురు మహిళలపై జరిగిన సామూహిక లైంగికదాడిలో దారుణమైన నిజాలు వెలుగుచూశాయి. మహిళలను సమీప అటవీ ప్రాంతానికి తీసుకెళ్లిన దుండగులు చిత్రహింసలకు గురిచేసి దాదాపు 4 గంటలపాటు వరుసగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
 
అంతటితో కసితీరని ఆ దుర్మార్గులు.. ఐదుగురు మహిళల మర్మాంగాల్లోకి చెట్టు కొమ్మను, తుపాకీని, నమిలే పొగాకును చొప్పించారు. తమ మూత్రాన్ని తాగాలంటూ మహిళలను ఒత్తిడి చేశారు. పైగా, తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా ఆ చిత్రహింసలను సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. వళ్లుగగుర్పొడిచే నిజాలు బాధిత మహిళల వద్ద జరిపిన విచారణలో వెల్లడయ్యాయి. 
 
జార్ఖండ్ రాష్ట్రంలో మనుషుల అక్రమ రవాణా, వలసలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన 11 మంది బృందం చోచాంజి గ్రామంలో వీధి నాటకం పేరుతో ప్రచారం చేపట్టింది. ఈ బృందం మధ్యాహ్నం 11 గంటల సమయంలో వీధి నాటకాన్ని ప్రదర్శిస్తుండగా, కొందరు దుండుగులు తుపాకీలతో వచ్చి ఐదుగురు తమతోపాటు తీసుకెళ్లారు. సమీపంలోని అడవిలోకి వారిని తీసుకెళ్లి లైంగికదాడి, చిత్రహింసలకు పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్‌తోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను గుర్తించామని, అందులో ఇద్దరి అరెస్టు చేశామని పోలీసులు శనివారం చెప్పారు. ఈ ఇద్దరు నిందితులు నేరాన్ని ఒప్పుకున్నారని తెలిపారు. మిగిలిన నిందితులను కూడా త్వరలో అరెస్టు చేస్తామని, ఆరుగురికీ కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు వెల్డించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోతి మూకలు అధికారంలోకి వస్తే రాష్ట్ర కుక్కలు చింపిన విస్తరే... బాబు