మహరాజ్ బాబాపై అత్యాచార ఆరోపణలు.. పుంసత్వ పరీక్షలు...
తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న ధాతి మహరాజ్ బాబాపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పుంసత్వ పరీక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
తనను తాను దైవాంశ సంభూతుడిగా ప్రకటించుకున్న ధాతి మహరాజ్ బాబాపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన పుంసత్వ పరీక్షలు ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.
నాగా సెక్టార్‌లోని చత్రాపూర్ ఆశ్రమంలో 2016లో దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాజ్ తనపై పలుమార్లు అత్యాచారం చేశారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రాణానికిహాని ఉండడంతోనే ఈ విషయాన్ని ఇంతకాలం బయటపెట్టలేదని తన ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు, అత్యాచారం జరిగిందని బాధితురాలు చెబుతున్న రోజున దాతీ మహరాజ్ అసలు ఆశ్రమంలోనే లేరంటూ ఆశ్రమ అధికారులు పోలీసులకు ఆధారాలు సమర్పించారు. డబ్బుల కోసమే ఆమె కేసు పెట్టిందని ఆరోపించారు. దీంతో పోలీసులు బాబా మొబైల్ కాల్ డేటాను పరిశీలించాలని నిర్ణయించారు. బాబాను ఇప్పటికే ప్రశ్నించిన పోలీసులు ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.