Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎన్నికలు : ఓటమి బాటలో ఏపీ మంత్రులు.. జిల్లాలకు జిల్లాలే కూటమి క్లీన్ స్వీప్

వరుణ్
మంగళవారం, 4 జూన్ 2024 (11:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం ధాటికి వైకాపా కుదేలైంది. పలువురు మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమి బాటలో సాగుతున్నారు. ఓటమి బాటలో ఉన్న మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్‌, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉష శ్రీచరణ్‌ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం జగన్‌ సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది. 
 
మరోవైపు జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్‌ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తూర్పుగోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగరంలో 9కి 8, పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments