Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

Advertiesment
theaters bandh

డీవీ

, బుధవారం, 15 మే 2024 (19:15 IST)
theaters bandh
"తెలంగాణా ఎగ్జిబిటర్స్  అసోసియేషన్  ఉన్నట్లుండి  శుక్రవారం నుంచి సినిమా ధియేటర్స్ ను  తాత్కాలికంగా  మూసివేసేందుకు నిర్ణయించడం షాక్ కు గురిచేసింది" అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో  అన్నారు. 
 
దీనితో పాటు పరిశ్రమ లో పలు సమస్యలు తెలుపుతూ,  థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేని కారణంగా థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు  ఆ అసోసియేషన్  వారు చెబుతున్నారు. జూన్ 27వ తేదీ కల్కీ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వరకు చిన్న సినిమాల రిలీజ్ లే   ఉన్నాయి. 
- ఎన్నికల హడావుడి  అనేది దేశమంతా ఉంది. నేను అడిగేది ఒక్కటే...మీరేలా ఒక్కరే  నిర్ణయం తీసుకుంటారు. 
 
webdunia
Nattikumar
నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా! .అలాగే ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి వంటి వాటితో చర్చించి, నిర్ణయం  తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి,  ఎల్లుండి (శుక్రవారం)  నుంచి ధియేటర్స్ మూస్తే ఇబ్బందికరం..
 
మీ వల్ల నిర్మాతలకు ,మల్టీప్లెక్స్ లకు కూడా  ఇబ్బందే..నిర్మాతలు  కంటెంట్ సిద్ధం చేసుకున్నాక ఇలాంటి చర్యలు నష్టం.కలిగిస్తాయి.  ప్రేక్షకులు  దీనివల్ల ఓటిటిలకు ఇంకా అలవాటుపడతారు. మరలా ధియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారా.? ఒక్కసారి ఆలోచించాలి. ఒకపని చెద్దాం కల్కీ కి,  పుష్ప 2, , ఓజి , దేవర  వంటి పెద్ద సినిమాలకు మాత్రమే ధియేటర్స్ ఓపెన్ చేసి, చిన్న సినిమాలు మనకు అవసరం లేదు అని చెప్పడమేనా మీ ఉద్దేశ్యం? 
 
పది రోజులు థియేటర్లు బంద్ అనడంలో మీ ఆంతర్యం ఏమిటో> అర్ధం కావడం లేదు. నేను ఒక ఎగ్జిబిటర్ ఉన్నాను. థియేటర్ వారి భాధలు ఏమిటో నాకు కూడా తెలుసు. కానీ మనం తీసుకునే నిర్ణయం అందరూ మెచ్చదగినదిగా ఉండాలి అని నా అభిప్రాయం. ఇప్పటికైనా వెంటనే అత్యవసర జాయింట్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. 
 
ఏపీలో మంత్రులంతా ఓడిపోవడం ఖాయం: నట్టి కుమార్ 
 
"ఏపీలో  ఎన్నికలు ముగిసాయి. గెలుపు, ఓటములు  అనేవి  అంచనాలే..అయినప్పటికీ మంత్రులంతా ఓడిపోవడం" అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ, "ఈ ఎన్నికలలో ఇచ్ఛాపురం నుంచి పిఠాపురం వరకు తిరిగి, స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుని మరీ చెబుతున్నాను . కూటమి  అభ్యర్థులు ఉత్తరాంధ్ర లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 
 
70 లక్షల ప్రజలు జన్మభూమి మీద అభిమానం తో ఎవరికి వారే  దేశవిదేశాల నుంచి వచ్చి , ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంతకుముందెప్పుడు ఈ స్థాయిలో రావడం చూడలేదు. అధికార వైసీపీ పక్షం పైన వ్యతిరేకంతోనే వారు భారీగా వచ్చారు. అధికార పార్టీ మంత్రులు, క్యాబినేట్ మొత్తం  ఓటమి చవి చూడనుంది
 
అందుకే భయంతో  అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు.
కొందరు అధికారులు తొత్తులుగా మారి ఈ చర్యలకు సపోర్ట్ చేస్తున్నారు. వారిందరికకీ  శాశ్వతంగా రెస్ట్ వస్తుంది.
 
పిఠాపురం లో పవన్ గెలుపుకు 99 శాతం సపోర్ట్ ఉంది. ఎవరో ఒక కుటుంబ సభ్యుడు సపోర్ట్ చేయపోనంత మాత్రానా ఏమి పవన్ కల్యాణ్ కు వచ్చే నష్టమేదీ  లేదు. అది అతని విజ్ఞతకే వదిలేస్తున్నాం. మెగాస్టార్ ఓ మహా వృక్షం.. ఆయన వల్లే మెగా హీరోలు ఎదిగారు.ఎవరిష్టం వారిది.. అల్లు అర్జున్ కూడా అలానే సపోర్ట్ చెసుకున్నారు. అయితే 
సినిమాను సినిమాలానే చూడండి..కాబట్టి అల్లు అర్జున్ ని  ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు.
అర్జున్  అలా వేరొకరికి సపోర్ట్ గా  వెళ్లటం నాకు నచ్చకపోవటమనేది నా వ్యక్తిగత అభిప్రాయం.. 
బన్నీ కూడా ఆలోచించాలి.. మీ ఫోటోను వారి  పార్టీ కి అనుగుణంగా సోషల్ మీడియాలో తిప్పుకున్నారు.
 
రెచ్చగొట్టే విధంగా వైసిపి వారు దాడులు చెస్తున్నారు ..అవన్ని తాత్కాలికం..కానీ అభివృద్ధి కావాలని ఓట్లెసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..కూటమి సారధ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చాక.. సినిమా పరిశ్రమ అభివృద్ధి కి కృషి చెస్తుంది ,యువకులకు ఉపాధి అవకాశాలను  కల్పిస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్