Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

Advertiesment
Sonakshi Sinha

ఠాగూర్

, బుధవారం, 15 మే 2024 (18:39 IST)
కొందరు హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థంకాదని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. కానీ, తన దగ్గరకు వచ్చే సరికి తాను తీసుకునే పారితోషికం విషయంలో స్పష్టంగా చెబుతానని తెలిపారు. అందువల్ల తనకు ఇండస్ట్రీల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. తాజాగా 'హీరామండి' వెబ్‌ సిరీస్‌తో పలకరించారు నటి సోనాక్షి సిన్హా. అందులో నటనకుగాను ప్రశంసలు అందుకున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిప్పుడే వైవిధ్యమైన పాత్రలు వస్తున్నట్లు చెప్పారు. 
 
'కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు వచ్చినా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో పాత్రలను ఎంచుకునే విధానాన్ని మార్చుకున్నా. కొన్ని సినిమాల్లో నా పాత్రలకు గుర్తింపు రానప్పటికీ వాటిల్లో నటించడం వృత్తిపరంగా ఎంతో ఆనందాన్నిచ్చింది. కమర్షియల్‌ చిత్రాలు ఎన్నోసార్లు నిరాశపరిచాయి. నాకు వచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేయాలనే నిరంతరం శ్రమించాను. 
 
సినిమాలు ప్రేక్షకాదరణ పొందకపోయినా నా పాత్రకు మాత్రం ప్రశంసలు దక్కేవి. ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాలి. నేను అలాంటి వాటిని ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తూ వచ్చాను. ఇన్ని సంవత్సరాలకు నేను అనుకున్న పాత్రలు వస్తున్నాయి. ఇది నా కెరీర్‌లోనే గొప్ప సమయం. భిన్నమైన పాత్రలు వస్తున్నాయి. అందుకే వాటిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నా' అని ఆమె వివరించారు. 
 
ఇకపోతే, ఇక రెమ్యునరేషన్‌ గురించి మాట్లాడుతూ 'నా పాత్ర స్థాయిని బట్టి నేను రెమ్యునరేషన్‌ తీసుకుంటాను. దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించగానే ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతాను. కొందరు పారితోషికం తగ్గించాలని కోరతారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలోనే ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు. స్త్రీలు ఎన్నోవిషయాల్లో బయట పోరాటం చేస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్లు కూడా పారితోషికం విషయంలో పోరాడుతున్నారు' అని తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన