Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారు... మంత్రి రోజా

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (17:32 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అతిధిగా పాల్గొన్న బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షో పై ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం మీడియాతో మంత్రి రోజా మాట్లాడుతూ.. 'అన్‌స్టాపబుల్' షోలో బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అబద్ధాలు చెప్పారని అన్నారు. 
 
అధికార దాహంతో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ పాదాలు తాకి ఏడ్చేశానంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఫొటోలను చంద్రబాబు నాయుడు విసిరేశారని మంత్రి రోజా చెప్పారు.
 
ఆ షోలో బావమరుదులు అన్‌స్టాపబుల్‌గా అబద్ధాలు చెప్పారని వ్యంగ్యంగా అన్నారు రోజా. పచ్చమీడియా ద్వారా చెబితే ప్రజలు నమ్మడంలేదు కాబట్టి, వేరే ఎంటర్‌టైన్‌మెంట్ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇవన్నీ నమ్మడానికి ప్రజలేమీ పిచ్చివాళ్లు కాదని, వీళ్లు తింగరోళ్లు అనుకుంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. 
 
ఒక ప్రోమో వస్తేనే ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందేనని, ఎన్టీఆర్ తన ఆరాధ్య దైవం అని చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని రోజా విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments